దట్టమైన అడవిలో 17 రోజుల తర్వాత నలుగురు పిల్లల ఆచూకి లభ్యం

by Anjali |
దట్టమైన అడవిలో 17 రోజుల తర్వాత నలుగురు పిల్లల ఆచూకి లభ్యం
X

దిశ, వెబ్‌డెస్క్: కొలంబియాలోని దట్టమైన అడవిలో పైలట్ సహా ఏడుగురితో ప్రయాణిస్తున్న విమానం ఇంజన్ ఫెయిల్ కావడంతో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా ముగ్గులు పెద్దలు అక్కడిక్కడే మృతి చెందగా.. నలుగురు పిల్లలు గల్లంతయ్యారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు వివిధ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ విపరీతమైన వర్షం కారణంగా.. దాదాపు 17 రోజుల తర్వాత.. 11 నెలల చిన్నారి సహా.. నలుగురు పిల్లలను అధికారు సజీవంగా కనుగొన్నట్లు అధ్యక్షుడు గుస్తావో పెట్రో ట్విట్టర్‌లో తెలిపారు. ఈ 17 రోజుల పాటు పిల్లలు అడవిలో లభించే పండ్లు తిని తమ ప్రాణాలు కాపాడుకున్నట్లు అధికారులకు తెలిపినట్లు సమాచారం. కాగా పిల్లలను సురక్షితంగా అడవి నుంచి తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story