- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారత్‌కు చేరుకున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని.. విమానం ల్యాండ్ అయ్యింది అక్కడే!
దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌కు చేరుకున్నారు. సోమవారం సాయంత్రం ఆమె ప్రయాణించిన విమానం హిండన్ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అయింది. బంగ్లాదేశ్‌లో అల్లర్లు కొనసాగుతుండటంతో ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి కుటుంబంతో సహా ఇండియాకు వచ్చారు. క్లిష్ట సమయంలో ఆమెకు మన దేశంలో ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. ఆమెను ఎయిర్‌ఫోర్స్ అధికారులు రిసీవ్ చేసుకున్నారు. భారత్ నుంచి లండన్ వెళ్లనున్నారు.
కాగా, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్‌లో తీవ్ర అల్లర్లకు కారణమైంది. ఇప్పటికే ఆ దేశంలో మూడు వందలకు పైగా నిరసనకారులు మృతి చెందారు. ఆదివారం ఒక్క రోజే పోలీసులు జరిపిన కాల్పుల్లో 100 మంది నిరసనకారులు చనిపోయినట్లు సమాచారం. దీంతో పరిస్థితులు మరింత అదుపుతప్పడంతో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని నిరసనకారులు పిలుపునిచ్చారు. ఇక చేసేదేం లేక దేశం అట్టుడుకుతున్న వేళ.. సోమవారం మధ్యాహ్నం ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా సమర్పించారు. అనంతరం మిలటరీ విమానంలో ఆమె భారత్‌కు వచ్చారు.