Bangladesh Crisis:బంగ్లా అల్లర్ల‌పై మాజీ ప్రధాని ఖలీదా జియా ఆవేదన!

by Jakkula Mamatha |
Bangladesh Crisis:బంగ్లా అల్లర్ల‌పై మాజీ ప్రధాని ఖలీదా జియా ఆవేదన!
X

దిశ,వెబ్‌డెస్క్:బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఆ దేశ నేషనలిస్ట్‌ పార్టీ అధినేత్రి, మాజీ ప్రధాని ఖలీదా జియా ఆవేద‌న‌ వ్యక్తం చేశారు. నిన్న (ఆగస్టు 6) బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహబుద్దీన్ అహ్మద్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 49 ప్రకారం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా జైలు శిక్షను తగ్గించి, విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం గృహనిర్బంధం నుంచి విడుదలైన ఖలీదా..బంగ్లాదేశ్‌ ఖిలాఫత్‌ మజ్లీస్‌ ప్రధాన కార్యదర్శి మౌలానా మమునుల్ హక్‌తో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ వనరులు వృధా అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసినట్లు ఢాకా ట్రిబ్యూన్ వెల్ల‌డించింది. 'ఈ దేశం మనది, ఈ దేశాన్ని మనం నిర్మించుకోవాలి' అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో దేశాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజల ప్రాణాలకు హాని తల పెట్టడమే కాకుండా ఆస్తులను ధ్వంసం చేయటం తీవ్రమైన విషయమని ఖలీదా జియా పేర్కొన్నారు. దేశ వనరులను కొల్లగొట్టడంలో చాలా మంది ప్రమేయం ఉంద‌ని, ఇది అన్యాయమని ఆమె పేర్కొన్న‌ట్లు ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది.

Advertisement

Next Story