- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లష్కరే తోయిబా మాజీ కమాండర్ అక్రమ్ ఖాన్ హతం
దిశ, డైనమిక్ బ్యూరో: పాకిస్థాన్‌లో వరుసగా ఉగ్రవాదులను గుర్తుతెలియని వ్యక్తులు హతమారుస్తున్నారు. భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, పఠాన్‌కోట్ ఉగ్రదాడి సూత్రధారి షాహిద్ లతీఫ్‌ను దుండగులు గత అక్టోబర్‌లో కాల్చి చంపిన విషయం తెలిసిందే. మరోవైపు సెప్టెంబర్ మొదటివారంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని రావల్‌కోట్‌లో ఉన్న అల్ ఖుదుస్ మసీదులో లష్కర్ కమాండర్ రియాజ్ అహ్మద్ అలియాస్ అబూ ఖాసిమ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు.
తాజాగా లష్కరే తొయీబా మాజీ కమాండర్, భారత వ్యతిరేక ప్రసంగాలకు పేరుగాంచిన అక్రమ్ ఖాన్ పాకిస్థాన్‌లో హత్యకు గురయ్యారు. ఇలా 20 నెలల్లో దాదాపు 19 మంది ఉగ్రవాదులు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హతమయ్యారు. అయితే తాజాగా ఖైబర్ పఖ్త్‌న్‌ఖ్వా ప్రావిన్స్‌లోని బాజౌర్ జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు అక్రమ్ ఖాన్‌ను కాల్చి చంపారు. ఈయన తన భారత వ్యతిరేక ప్రసంగాలతో యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేవారు.