- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికాలో అగ్ని ప్రమాదం: ఓ భారతీయుడు మృతి
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలోని న్యూయార్క్ సిటీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ భారతీయుడు మృతి చెందాడు. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం ఆదివారం వెల్లడించింది. శుక్రవారం హార్లెమ్ ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్‌లో అగ్ని ప్రమాదం జరగగా ఫాజిల్ ఖాన్(27) అనే భారతీయుడు మరణించాడని తెలిపింది. ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొంది. ఫాజిల్ ఖాన్ కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నామని..మృత దేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది. అయితే న్యూయార్క్ అగ్ని మాపక విభాగం వివరాల ప్రకారం..భవనంలోని ఆరో అంతస్తులో లిథియం-అయాన్ బ్యాటరీ వల్ల మంటలు వ్యాపించాయని తెలుస్తోంది. దీంతో ఫాజిల్ ఖాన్ మరణించడంతో పాటు 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మరికొందరు ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు భవనంపై నుంచి కిందకు దూకిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, ఢిల్లీ కి చెందిన ఫాజిల్ ఖాన్..2020లో కొలంబియా యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం ‘ది హెచింగర్ రిపోర్ట్’లో డేటా జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.