తనకంటే వయస్సులో చిన్నవాడితో పెళ్ళికి రెడీ అయినా నార్వే యువరాణి..అతని స్పెషల్ ఏంటంటే..?

by Maddikunta Saikiran |
తనకంటే వయస్సులో చిన్నవాడితో పెళ్ళికి రెడీ అయినా నార్వే యువరాణి..అతని స్పెషల్ ఏంటంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా అమ్మాయిలు తన కంటే పెద్ద వాళ్ళను పెళ్లి చేసుకుంటారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ మధ్య వయస్సుతో సంబంధం లేకుండా తమ కంటే చిన్న వారితో కూడా అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఆయితే తాజాగా ఓ దేశపు యువరాణి కూడా తన కంటే చిన్నవాడితో పెళ్ళికి రెడీ అయ్యింది. ఇంతకీ ఎవరు ఆ యువరాణి..?ఆమె ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది..? ఆమె గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ వినాల్సిందే. నార్వే దేశానికి చెందిన యువరాణి 52 ఏళ్ల మార్తా లూయిస్ తన కంటే వయసులో మూడేళ్లు చిన్నవాడైన హాలీవుడ్ ఆధ్యాత్మిక గురువు డ్యూరెక్ వెరెట్(49)ను పెళ్లి చేసుకోబోతున్నారు.యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన నార్వేలోని గీరాంజర్‌లో వీరి పెళ్లి జరగనుంది. మార్తా లూయిస్‌ ప్రస్తుత నార్వే రాజు హరాల్డ్ యొక్క పెద్ద కుమార్తె. కాగా ఆమెకు ఇది రెండో పెళ్లి.ఆమె 2002లో ప్రముఖ రచయిత అరి బెన్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ జంట 2017లో విడిపోయింది. భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత 2019లో అరి బెన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, అదే ఏడాది ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెరెట్‌తో తన ప్రేమ వ్యవహారాన్ని బయట ప్రపంచానికి మార్తా లూయిస్‌ వెల్లడించింది.2022 జూన్‌లో వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది.

కాగా డ్యూరెక్ వెరెట్‌ ఆఫ్రికన్ అమెరికన్ సంతతికి చెందిన వ్యక్తి. ఇతనిపై చాలా వివాదాలు ఉన్నాయి. ఆత్మ, మరణం గురించి అతడు ప్రచారం చేసే అంశాలపై చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. తనకు 28 ఏళ్ల వయసులో చావు నుంచి బయటపడ్డానని.. మరణం నుంచి పునరుజ్జీవనం పొందానని అతడు చెప్పుకుంటు ఉంటాడు. అలాగే క్యాన్పర్, కరోనా రోగాలను నయం చేస్తానంటూ అతడు కోట్లాది రూపాయలు సంపాదించాడు. గ్వినేత్ పాల్ట్రో, ఆంటోనియో బాండెరాస్ లాంటి ఎందరోప్రముఖులకు అతడు ఆధ్యాత్మిక సలహాదారుగా ఉన్నాడు. వెరెట్‌ మంత్రగాడు, పిచ్చోడని నార్వే మీడియా విమర్శించినా యువరాణి లూయిస్ మాత్రం అతడిని పెళ్లాడేందుకు సిద్ధపడటం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed