- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచ ధనికుల జాబితాలో మళ్లీ టాప్‌లో ఎలన్ మస్క్
దిశ, వెబ్‌డెస్క్: 187 బిలియన్ల నెట్ వర్త్‌తో ఎలన్ మస్క్ మళ్లీ వరల్డ్ రిచెస్ట్ పర్సన్ జాబితాలో టాప్‌లో నిలిచాడు. ఈ మేరకు బ్లూమ్ బర్గ్ బిలినియర్ ఇండెక్స్ జాబితాను తాజాగా విడుదల చేసింది. ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ అర్నాల్ట్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తూ మస్క్ వరల్డ్ రిచెస్ట్ పర్సన్‌గా మళ్లీ అవతరించాడు. టెస్లా షేర్ల ధర పెరగడంతో మస్క్ ఈ ఫీట్ సాధించాడు. కాగా టెస్లా షేర్లు 92 శాతానికి ఎగబాకాయి.
బెర్నార్డ్ అర్నాల్ట్ నెట్ వర్త్ 185 బిలియన్లు ఉండగా మస్క్ 187 బిలియన్ డాలర్లతో టాప్‌లో నిలిచినట్లు బ్లూమ్ బర్గ్ బిలియనిర్స్ ఇండెక్స్ తెలిపింది. అయితే గతేడాది నవంబర్ - డిసెంబర్‌లో మస్క్ నెట్ వర్త్ అమాంతం 200 బిలియన్ల డాలర్లు పడిపోయింది. చరిత్రలో ఇటీవల ఇంత మొత్తంలో నెట్ వర్త్ లాస్ కావడం ఇదేనని విశ్లేషకులు తెలిపారు. సోమవారం ట్రేడింగ్‌లో టెస్లా షేర్లు 5.46 శాతం పెరిగి 207.63 డాలర్ల వద్ద నిలిచాయి.
గత నెలలో ఈ పెరుగుదల 20 శాతంగా ఉంది. 2023లో నాస్డాక్ వంద ఇండెక్స్‌లో ఇది 11 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. న్యూయార్క్‌కు చెందిన బ్లూమ్ బర్గ్ ఇండెక్స్ ప్రతి రోజు ట్రేడింగ్ ఆధారంగా ప్రపంచంలోని ధనికుల జాబితాను అందిస్తోంది. మస్క్ ట్విట్టర్‌తో పాటు, టెస్లా, స్పేస్ ఎక్స్‌కు సీఈవోగా ఉన్నారు. స్పేస్ ఎక్స్ రాకెట్ల తయారీ సంస్థ కాగా, టెస్లా టెక్నాలజీ అడ్వాన్స్ మెంట్ సంస్థగా పేరు గాంచింది.
సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో ట్విట్టర్ మనందరికి పరిచయమే. 2022లో ట్విట్టర్‌కు మస్క్ 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తానని ఆఫర్ చేయగా అక్టోబర్‌లో ట్విట్టర్ ఆయన సొంతం చేసుకున్నారు. ట్విట్టర్‌కు ఎలన్ మస్క్ సీఈవో అయిన తర్వాత 3,700 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇటీవల 50 మందిని సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది. నేగెటివ్ ఫీడ్ బ్యాక్ గుడ్ థింగ్ అని చెబుతున్న మస్క్ ఇటీవల మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫాంలో అందరిని అన్ బ్లాక్ చేశాడు.