Donald Trump : కమలా హ్యారిస్‌తో డిబేట్‌‌కు వెళ్లను : ట్రంప్

by Hajipasha |
Donald Trump : కమలా హ్యారిస్‌తో డిబేట్‌‌కు వెళ్లను : ట్రంప్
X

దిశ, నేషనల్ బ్యూరో : యావత్ అమెరికా సెప్టెంబరు 10వ తేదీ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఆ రోజున రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ మధ్య ‘ఏబీసీ న్యూస్’ వేదికగా జరిగే లైవ్ డిబేట్‌ను చూసేందుకు అందరూ రెడీ అవుతున్నారు. ఈతరుణంలో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కమలా హ్యారిస్‌తో జరిగే డిబేట్‌కు తాను గైర్హాజరయ్యే అవకాశం ఉందనే సంకేతాలు ఇచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. తానెందుకు ఆ డిబేట్‌లో పాల్గొనాలంటూ ఎక్స్ వేదికగా ట్రంప్ ఒక పోస్ట్ చేశారు.

ఏబీసీ న్యూస్‌కు చెందిన యాంకర్ జొనాథన్ కార్ల్ ఇటీవలే సెనెటర్ టామ్ కాటన్‌ను ఇంటర్వ్యూ చేసిన తీరు ఏకపక్షంగా ఉందని ఆయన మండిపడ్డారు. ఆ న్యూస్ ఛానల్‌కు చెందిన యాంకర్లను ట్రంప్ విద్వేషులుగా ట్రంప్ అభివర్ణించారు. ఇవన్నీ చూశాకే తాను ఏబీసీ న్యూస్ డిబేట్‌కు దూరంగా ఉండాలనే ఆలోచనకు వచ్చానన్నారు. ఇప్పటికే ఏబీసీ న్యూస్‌పై ట్రంప్ పలు కేసులు పెట్టారని.. ఇవన్నీ తెలిసి ఉద్దేశపూర్వకంగానే లైవ్ డిబేట్ కోసం ఆ న్యూస్ ఛానల్‌ను కమలా హ్యారిస్ ఎంచుకున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed