పాకిస్తాన్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

by GSrikanth |   ( Updated:2023-03-05 05:09:00.0  )
పాకిస్తాన్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: తీవ్ర సంక్షోభంలో అతలాకుతలం అవుతోన్న పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ప్రస్తుతం ఆ దేశంలో ద్రవ్యోల్బణం తారా స్థాయికి చేరుకొని 50 ఏళ్ల గరిష్టం వద్ద రికార్డు కొనసాగుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే పాకిస్తాన్ రూపీ గణనీయంగా పడిపోయింది. ఈ సంక్షోభం బంగారంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలపై పడింది. లీటర్ డీజిల్ ధర రూ.280కి చేరింది. బంగారం ధరలు భారీగా పెరిపోయాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.2.6 లక్షలకు చేరింది. ఈ పరిస్థితిని తాము తట్టుకోలేక పోతున్నామని పాక్ ప్రజలు విలవిల్లాడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed