- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవినీతిలో భారత్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా..?
దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోని అత్యంత అవినీతి, తక్కువ అవినీతి దేశాల జాబితా విడుదలైంది. 180 దేశాల జాబితాలో అవినీతి ఎక్కువగా ఉన్న దేశాల్లో సోమాలియా, సిరియా, యెమెన్ ఉన్నాయి. అదే సమయంలో, అవినీతి తక్కువగా ఉన్న దేశాల్లో డెన్మార్క్, న్యూజిలాండ్, ఫిన్లాండ్ ఉన్నాయి. భారత దేశం విషయానికి వస్తే 93 వ స్థానంలో ఉంది. అయితే ఒక దేశంలో ఎంత అవినీతి జరుగుతుందో. ఎలాంటి కార్యకలాపాలను అవినీతిగా పరిగణిస్తారో, ఈ నివేదికను ఎలా తయారు చేస్తారో చాలామందికి తెలిసి ఉండదు. మరి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక దేశం ఎంత అవినీతిమయమైందో ఎలా నిర్ణయిస్తారు ?
ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ అనేది జర్మనీలోని బెర్లిన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ. ఈ సంస్థ ప్రతి సంవత్సరం కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్‌ను విడుదల చేస్తుంది. ఈ సూచిక ప్రపంచ దేశాలలో అవినీతి స్థాయిని చూపుతుంది. ఈ సంస్థ 13 వేర్వేరు సర్వేలు, సంస్థల నుండి సేకరించి దేశంలోని అవినీతిని గుర్తించడానికి 3 రకాల డేటాను స్వీకరిస్తుంది. వరల్డ్ బ్యాంక్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వంటి సంస్థలు ఇందులో టయ్యప్ అయి ఉన్నాయి. దీంతోపాటు వివిధ దేశాలకు చెందిన నిపుణులు, వ్యాపారవేత్తలతోనూ మాట్లాడుతున్నారు. ఈ వేర్వేరు భాగాల నుండి వచ్చే డేటా లెక్కించి ర్యాంక్ తయారు చేస్తారు. అలా ఎక్కువ అవినీతి చేస్తున్న దేశాలు, తక్కువ అవినీతి చేస్తున్న దేశాల పేర్లను వెల్లడిస్తారు.
ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ జాబితాలో 180 దేశాలను చేర్చారు. ఈ జాబితాలో లేని దేశాలలో అవినీతి లేదని కాదు. వాస్తవానికి, ఆ దేశాలు జాబితాలో చేర్చలేదు. ఎందుకంటే పరిస్థితిని వివరించడానికి తగినంత డేటా అక్కడి నుండి అందకపోవడంతో వాటిని ఇండెక్స్‌లో భాగం చేయలేదని నిపుణులు చెబుతున్నారు. ఇండెక్స్‌లో ఎంత ఎక్కువ ర్యాంక్ ఉంటే ఆ దేశాన్ని అంత అవినీతి దేశంగా పరిగణిస్తారు. ఉదాహరణకు, ఫిన్లాండ్ ర్యాంక్ 1ని కలిగి ఉంది అంటే ప్రపంచంలోనే అతి తక్కువ అవినీతిని కలిగి ఉంది. అలాగే సోమాలియా 180 వ స్థానంలో ఉంది. అంటే ఇక్కడ గరిష్ఠంగా అవినీతి ఉందని అర్థం.
ప్రపంచ దేశాల పరిస్థితి ఏమిటి ?
ఇండెక్స్ ర్యాంకింగ్ లను బట్టి ఆ దేశం అవినీతి శాతాన్ని లెక్కిస్తారు. 180 దేశాల జాబితాలో భారత్ 93వ ర్యాంక్‌లో, పాకిస్థాన్ 133వ ర్యాంక్‌లో ఉన్నాయి. గత సంవత్సరం, ఈ సంవత్సరం విడుదల చేసిన సూచీని పోల్చి చూస్తే, ప్రభుత్వ రంగంలో అవినీతిని అరికట్టడానికి చాలా దేశాలు చాలా ప్రభావవంతమైన చర్యలు తీసుకోలేదని స్పష్టమవుతుంది.
ఏ విషయాలు అవినీతిగా పరిగణిస్తారు ?
అవినీతి అంటే లంచం ఇవ్వడమే కాదు. ఈ సూచికను రూపొందించేటప్పుడు, చాలా విషయాలు అవినీతిలో భాగంగా పరిగణించారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ కార్యాలయాల వ్యక్తిగత వినియోగం, ప్రభుత్వ రంగంలో పెరుగుతున్న అవినీతి, ప్రభుత్వ రంగంలో అవినీతిని ప్రోత్సహించే నిబంధనలను అమలు చేయడం, సివిల్ సర్వీస్‌లో బంధువుల నియామకం, అవినీతి కేసుల నమోదు.. సంబంధిత వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం. ఇది కాకుండా, ప్రజలను నేరుగా ప్రభావితం చేసే అనేక కేసుల ఆధారంగా జాబితాను తయారు చేస్తారు.