దీపావళికి అధికారిక సెలవు ప్రకటించిన మరో దేశం

by Mahesh |
దీపావళికి అధికారిక సెలవు ప్రకటించిన మరో దేశం
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం దీపావళిని అధికరిక సెలవు దినంగా ప్రకటించినట్లు సెనేటర్ నికిల్ సవాల్ ట్వీట్ చేశారు. భారతీయులు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో దీపావళిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దీంతో పెన్సిల్వేనియా రాష్ట్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపావళిని అధికారిక సెలవుదినంగా చేయడానికి రాష్ట్ర సెనేటర్ గ్రెగ్ రోత్‌మన్, సవాల్ కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టాగా.. నిన్న అధికారికంగా చట్టం అయింది. దీంతో సెనేటర్ నికిల్ సవాల్ భారతీయులను ఉద్దేశించి ట్విట్టర్‌లో ఇలా రాసుకొచ్చారు. "ఈ కాంతి, కనెక్షన్ యొక్క పండుగను జరుపుకునే పెన్సిల్వేనియా అందరికీ మీరు కనిపించారు. మీకు స్వాగతం, మీరు ఈ ప్రాంతానికి చాలా ముఖ్యం".. అని రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed