- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Congo Floods: కాంగోలో వరద బీభత్సం.. 203 మంది మృతి
దిశ, వెబ్ డెస్క్ : ఆఫ్రికాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(Congo)లో వరదలు.. బీభత్సం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలకు దక్షిణ కివు ప్రావిన్స్ లో నదులకు వరద నీరు పోటెత్తింది. దీంతో ఊర్లకు ఊర్లే వరద నీటిలో కొట్టుకుపోయాయి. వరదల ధాటికి వందలాది మంది మరణించారని.. ఇప్పటి వరకూ 203 శవాలు వెలికి తీసినట్టు సమాచారం. పలు ప్రాంతాల్లో వందలాది మంది గల్లంతయ్యారు.
ఉన్నట్టుండి భారీ వర్షాలు కురవడం వల్ల కొన్ని చోట్ల నదులు ఉప్పొంగాయి. అనూహ్యంగా వచ్చిన వరదలకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లే అవకాశం కూడా లేకుండా ఒక్కసారిగా ముంచుకొచ్చాయి. ప్రభుత్వమూ ముందస్తు హెచ్చరికలు చేయలేదు. రెస్క్యూ టీమ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ ఆ వరదల ధాటికి సహాయం అందించడమూ కష్టమవుతోంది. ఎక్కడి నుంచో కొట్టుకొస్తున్న శవాలను గుర్తించి వాటిని బయటకు తీస్తున్నారు. వైద్యులు కంటి మీద కునుకు లేకుండా పని చేస్తున్నారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రులన్నీ బాధితులతో నిండిపోతున్నాయి.
వరదల కారణంగా బురదల్లో చిక్కుకున్న మరిన్ని మృతదేహాలను వెలికితీస్తున్న అక్కిడి అధికారులు తెలిపారు. వందలాది ఇళ్లు కొట్టుకుపోయిన న్యాముకుబి గ్రామంలో రెస్క్యూ కార్మికులు శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం ఇంకా వెతుకుతున్నారు.
దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు బోరున విలపిస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన వారు తమ కుటుంబాల కోసం గాలిస్తున్నారు. ఊరంతా బీడుగా మారిపోయిందని, రాళ్లు మాత్రమే మిగిలాయని అంటున్నారు. ప్రస్తుతం మా భూమి ఎక్కడ ఉందో కూడా చెప్పలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గురువారం కివు సరస్సు ఒడ్డుకు సమీపంలోని కలేహే భూభాగంలోని గ్రామాలలో నదులు(rivers) ఉగ్రరూపం దాల్చాయి. ఈ వరదల్లో అనేక మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రాణాలతో బయటపడిన వ్యక్తి ఆకస్మిక వరదలు చాలా వేగంగా వచ్చాయని, అవి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయని చెప్పారు. అప్రమత్తమైన అధికారులు ఆహార సామాగ్రిని పంపడంతోపాటు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మరోవైపు వర్షాల కారణంగా ప్రభావిత ప్రాంతానికి వెళ్లే పలు ప్రధాన రహదారులు కొట్టుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అన్నారు.
ఇటీవలి కాలంలో భారీ వర్షాలు.. తూర్పు ఆఫ్రికాలో వేలాది మందికి కష్టాలను తెచ్చిపెట్టాయి. ఉగాండా, కెన్యాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు సంభవించాయి. అయితే కాంగోలో మాత్రం నదుల వల్ల నష్టం జరగడం ఇది నాలుగోసారి.
Also Read: Pakistan | ఇమ్రాన్ ఖాన్‌ను మహమ్మద్ ప్రవక్తతో పోల్చిన అభిమాని!.. అతడికి ఏ శిక్ష విధించారంటే..