దేవుడిని తిట్టాడని మరణ శిక్ష.. ఎక్కడంటే..

by Shiva |
దేవుడిని తిట్టాడని మరణ శిక్ష.. ఎక్కడంటే..
X

దిశ, వెబ్ డెస్క్ : దేవుడిని దూషిస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేశాడనే ఆరోపణతో ఓ క్రైస్తవ యువకిడికి కోర్టు మరణశిక్ష విధించిన ఘటన పాకిస్థాన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బహవల్‌పూర్‌లో ఇస్లామ్‌ కాలనీకి చెందిన 19 ఏళ్ల నౌమాన్‌ మసేహ తమ దేవుడిని దూషిస్తూ.. విద్వేశపూరితమైన పోస్టులను షేర్‌ చేశాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి వాట్సాప్‌ లో అతడు పంపిన సందేశాలను కోర్టులో సాక్ష్యంగా ప్రవేశపెట్టారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అతడికి మరణశిక్షతో పాటు, రూ.20 వేల జరిమానా కూడా విధించింది.

Advertisement

Next Story