Sheikh Hasina: ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రలు.. కొన్ని నెలల క్రితమే అంచనా వేసిన షేక్ హసీనా

by Harish |
Sheikh Hasina: ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రలు.. కొన్ని నెలల క్రితమే అంచనా వేసిన షేక్ హసీనా
X

దిశ, నేషనల్ బ్యూరో: గత కొంత కాలంగా బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేసి ఇండియాకు వచ్చారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఆమె చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ అవుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఆమె మాట్లాడుతూ, తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి "కుట్రలు" పన్నుతున్నారని, తన తండ్రి, స్వాతంత్య్ర వీరుడు షేక్ ముజిబుర్ రెహమాన్ వలె హత్య చేయబడవచ్చని పేర్కొంది. బంగ్లాదేశ్, మయన్మార్‌లోని కొన్ని ప్రాంతాలను కలిపి కొత్తగా ‘‘క్రైస్తవ దేశం’’ ఏర్పాటుకు ‘‘శ్వేత జాతీయులు’’ కుట్ర పన్నారని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ఆమె నిజంగా తన పదవిని కోల్పోవడంతో గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. జనవరిలో గెలిచిన తరువాత బంగ్లాదేశ్‌లో వైమానిక స్థావరాన్ని నిర్మించేందుకు ఒక విదేశీ దేశాన్ని అనుమతించాలని నాకు అభ్యర్థనలు వచ్చాయి, అయితే అందుకు నేను నిరాకరించడంతో ప్రభుత్వాన్ని ఎప్పుడూ ఇబ్బందులకు గురిచేశారు. ఒకవేళ దానికి అనుమతించినట్లయితే నాకు ఎటువంటి సమస్య ఉండేది కాదు, అయితే, ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గబోనని హసీనా ఈ ఏడాది మే నెలలో చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed