ఆ విషయంలో రష్యాకు చైనా సహాయం: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

by vinod kumar |
ఆ విషయంలో రష్యాకు చైనా సహాయం: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్‌లో యుద్ధంపై త్వరలో నిర్వహించే శాంతి సదస్సుకు విఘాతం కలిగించేందుకు రష్యా ప్రయత్నిస్తుంటే..దానికి చైనా సహాయం చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు. సింగపూర్‌లో ఆదివారం నిర్వహించిన షాంగ్రి-లా డిఫెన్స్ ఫోరమ్‌ సదస్సులో ఆయన ప్రసంగించారు. శాంతి చర్చలకు హాజరుకావొద్దని చైనా ఇతర దేశాలపై ఒత్తిడి తెస్తోందని తెలిపారు. ‘రష్యా ఈ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఉపయోస్తోంది. చైనీస్ దౌత్యవేత్తల సహాయంతో శాంతి శిఖరాగ్ర సమావేశానికి భంగం కలిగించడానికి కుట్ర చేస్తోంది. చైనా వంటి పెద్ద స్వతంత్ర శక్తివంతమైన దేశం పుతిన్ చేతిలో ఒక సాధనంగా మారడం విచారకరం’ అని వ్యాఖ్యానించారు.

అణు భద్రత, ఆహార భద్రత, యుద్ధ ఖైదీల విడుదల, రష్యా అపహరించిన ఉక్రేనియన్ పిల్లలను తిరిగి తీసుకురావడం వంటి అంశాలపై శిఖరాగ్ర సమావేశంలో చర్చించనున్నట్టు చెప్పారు. రాబోయే శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని ఉన్నత రక్షణ అధికారులను జెలెన్ స్కీ కోరారు. కొన్ని దేశాలు సదస్సుకు రాకపోవడానికి కట్టుబడి ఉండకపోవటం పట్ల తాను నిరాశ చెందానని చెప్పారు. యుద్ధం ముగింపునకు, స్థిరమైన, న్యాయమైన శాంతికి దారితీసే వివిధ ప్రతిపాదనలు వినడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమాలనికి పలు దేశాల రక్షణ మంత్రులు హాజరయ్యారు. అయితే పుతిన్ ప్రసంగించే సమయంలో చైనా రక్షణ మంత్రి వేదికపై కనిపించకపోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed