- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
China-Philippines: దక్షిణ చైనా సముద్ర వివాదంపై తాత్కాలిక ఒప్పందాన్ని కుదుర్చుకున్న చైనా, ఫిలిప్పీన్స్
దిశ, నేషనల్ బ్యూరో: వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర విషయంలో ఘర్షణలను నివారించడానికి చైనా, ఫిలిప్పీన్స్ రెండు కూడా ఒక తాత్కాలిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని సంబంధిత వర్గాల వారు తెలిపారు. ఆదివారం రెండు దేశాలకు చెందిన దౌత్యవేత్తలు పదేపదే జరుగుతున్న ఘర్షణలు తగ్గించడానికి ఒక అవగాహనకు వచ్చినట్టు మనీలా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ చర్చల్లో ఇటీవల సెకండ్ థామస్ షోల్ వద్ద జరిగిన ఘర్షణను ప్రస్తావించారు.
ఇటీవల ఫిలిప్పీన్స్ దళాలు మనీలా ఔట్‌పోస్ట్ వద్ద సైనిక సిబ్బందికి ఆహారం, ఇతర సామాగ్రి ఇవ్వడానికి వెళ్లగా చైనీస్ కోస్ట్ గార్డ్ అడ్డుపడ్డాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా చూడటానికి ఇరు దేశాలు కూడా తాజాగా తాత్కాలిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
దక్షిణ చైనా సముద్రంలో ఒకరి స్థానాలను మరొకరు ఆక్రమించకుండా ఉండాలని, అలాగే శాంతియుత వాతావరణం పాటించాలని ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాలు నిర్ణయించినట్లు మనీలాలోని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ ఒప్పందం గురించి చైనా ఇంకా ఏం మాట్లాడలేదు. రెండవ థామస్ షోల్ పశ్చిమ ఫిలిప్పీన్స్ ద్వీపం పలావాన్ నుండి 200 కిలోమీటర్లు, చైనా సమీప ప్రధాన భూభాగమైన హైనాన్ ద్వీపం నుండి 1,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంది.