- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పారిస్ ఒలింపిక్స్‌ను రష్యా లక్ష్యంగా చేసుకునే చాన్స్: ఫ్రాన్స్ ప్రెసిడెంట్
దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది వేసవిలో పారిస్‌లో జరగబోయే ఒలంపిక్స్‌ను రష్యా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అన్నారు. కొత్త ఒలింపిక్స్ ఆక్వాటిక్ సెంటర్ ప్రారంభోత్సవం కోసం పారిస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా, ఒక విలేఖరి రష్యా ఒలింపిక్స్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని భావిస్తున్నారా అని అధ్యక్షుడిని ప్రశ్నించగా, దీనికి సమాధానంగా మాక్రాన్, మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఆటలను లక్ష్యంగా చేసుకుని విదేశీ బెదిరింపులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మాక్రాన్ గత నెలల్లో రష్యాకు వ్యతిరేకంగా కఠినమైన వైఖరిని అవలంబించారు, అలాగే మాస్కోను ఓడించాలని ప్రతిజ్ఞ చేశారు. రష్యన్ తప్పుడు ప్రయత్నాలు చేస్తుందని దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పాటు, ఇజ్రాయెల్-గాజాలో హమాస్‌తో చేస్తున్న యుద్ధం, అలాగే ఇతర సంక్లిష్టమైన పరిస్థితుల మధ్య ఒలింపిక్స్‌ను సజావుగా నిర్వహించడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది.