PM Trudeau : ప్రధానిని చంపేస్తానంటూ హెచ్చరికలు.. యువకుడి అరెస్టు

by Hajipasha |
PM Trudeau : ప్రధానిని చంపేస్తానంటూ హెచ్చరికలు.. యువకుడి అరెస్టు
X

దిశ, నేషనల్ బ్యూరో : కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో‌‌ను చంపేస్తానంటూ ఆన్‌లైన్‌ వేదికల్లో వీడియో సందేశాలు పెడుతున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వార్నింగ్స్ ఇచ్చిన వ్యక్తి పేరు డేవిడ్ జాలెవ్‌స్కీ(33) అని వెల్లడించారు. ‘‘ప్రధాని ట్రూడోను చంపుతా. పోలీసులు, భద్రతా బలగాలు ఎవరైనా అడ్డొస్తే వాళ్లను కూడా కడతేరుస్తా’’ అని పేర్కొంటూ రెండుసార్లు వీడియోలను డేవిడ్ జాలెవ్‌స్కీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేశాడని పోలీసులు గుర్తించారు.

ఈ అంశంపై సమాచారం అందిన వెంటనే హుటాహుటిన నిందితుడి లొకేషన్‌ను ట్రాక్ చేసి అరెస్టు చేశారు. కెనడా తీవ్రవాద వ్యతిరేక దళం ‘ఇంటిగ్రేటెడ్ నేషనల్ సెక్యూరిటీ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్స్’ (ఇన్ సెట్) కూడా రంగంలోకి దిగడంతో నిందితుడి ఆచూకీ త్వరగా లభించింది. దీంతో ప్రధాని ట్రూడోకు ప్రాణహాని తప్పిందని కెనడా పోలీసు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రధాని ట్రూడోను చంపేస్తామంటూ ఆన్‌లైన్‌లో హెచ్చరికలు చేసిన వ్యవహారంలో ఈ ఏడాది జులై 22న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed