- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతరిక్షంలో జీవిస్తే పిల్లలు పుట్టరా.. ?
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతకాలంలో అంతరిక్ష యానం, అంతరిక్ష ప్రయోగాలు సాధారణమైంది. అన్ని దేశాలు అంతరిక్ష పరిశోధనల్లో ముందుకు వెళుతున్నాయి. పోటాపోటీగా గ్రహాలపైకి రాకెట్లను పంపిస్తూ పరిశోధనలు చేస్తున్నాయి. భూమిపై ఉన్నట్టు ఇతర గ్రహాల్లో మానవుడు నివసించగలడా అన్న విషయాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగానే అంగారక గ్రహం, చంద్ర గ్రహంపైకి మానవులను పంపేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. అంగారక గ్రహంపై ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి పరిశోధనలు కూడా జరిగాయి. అయితే అంగారక గ్రహం పైకి వెళ్లిన వారు సాధరణ జీవితాన్ని గడుపుతారా, అంతరిక్షంలో గర్భం ధరిస్తారా.. అక్కడి వాతావరణాన్ని తట్టుకుని ఉండగలరా అన్న విషయాలను గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
భూమిపై బిడ్డకు జన్మనిచ్చినట్టు అంతరిక్షంలో బిడ్డకు జన్మనివ్వడం అసాధ్యం అని నిపుణులు భావిస్తున్నారు. అంతరిక్షంలో ఉండే మైక్రోగ్రావిటీ కారణంగా గర్భం దాల్చడం కష్టం అంటున్నారు. ఒకవేళ గర్భం దాల్చినా పిండం అభివృద్ధి చెందేందుకు ఎన్నో అవాంతరాలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఈ విషయం పై ప్రొఫెసర్ ఆడమ్ వాట్కిన్స్ మాట్లాడుతూ అంతరిక్షంలో గర్భం దాల్చగలరా లేదా అనే విషయం చెప్పలేమన్నారు. డెవలప్ అయిన సాంకేతికత పరిజ్ఞానం ద్వారా మైక్రో గ్రావిటీ వల్ల ఏర్పడే సమస్యలను ఎదుర్కొవచ్చన్నారు. అంతరిక్షానికి అంగారక గ్రహాలకు గర్భిణీ స్త్రీని తీసుకెళ్లకుండా గుడ్లు, పిండం, ఘనీభవించిన స్పెర్మ్ ని పంపడం మంచిదంటున్నారు. మైక్రోగ్రావిటీతో పాటు హానికరమైన రేడియేషన్ నుంచి గర్భిణీ స్త్రీలు రక్షణపొందాలని దానికి కావలసిన సాంకేతికత ఇంకా అభివృద్ధి చెందలేదన్నారు.