- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బంగ్లా మాజీ ప్రధాని మరో బిగ్ షాక్.. ఆశ్రయం ఇవ్వలేమని బ్రిటన్ సర్కార్ ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరిన్ని కష్టాలు ఎదురయ్యాయి. ఆమెకు ఆశ్రయం ఇచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం నిరాకరిస్తున్నట్లు తెలుస్తున్నది. క్లిష్ట సమయంలో ఆమె నేరుగా భారత్‌కు వెళ్లారు.. కాబట్టి అక్కడే ఆశ్రయం తీసుకోవాలని సూచింనట్లు సమాచారం. ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం హసీనాకు ఆశ్రయం కల్పించడం చాలా కష్టతరం అవుతుందని బ్రిటన్ సర్కార్ అభిప్రాయపడింది. దీంతో మరికొన్ని రోజులు హసీనా భారత్‌లోనే ఉండనున్నారు. కాగా, రిజర్వేషన్ల కోటా అంశంపై ఆందోళనకారులు, అధికార పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలతో బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి.
నిరసనకారులు తన అధికారిక నివాసాన్ని చుట్టుముట్టేందుకు రావడంతో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం నేరుగా కుటుంబంతో కలిసి ఇండియాకు వచ్చారు. ఇండియాలో ఆమెకు ఎయిర్‌ఫోర్స్ అధికారులు స్వాగతం పలికారు. ముందుగా ఇక్కడ ఆశ్రయం ఇచ్చేందుకు భారత్ ప్రభుత్వం ససేమిరా అంటున్నట్టుగా తెలిసింది. చివరకు యూకే కూడా ఆమెకు ఆశ్రయం ఇచ్చేందుకు నిరాకరిస్తుండటంతో అక్కడ అవకాశం దొరికే వరకూ భారత్‌లోనే ఉంటారని సమాచారం.