- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉక్రెయిన్‌కు అమెరికా రూ.16వేల కోట్ల సైనిక ప్యాకేజీ
దిశ, నేషనల్ బ్యూరో : రష్యాతో యుద్ధంలో ఉన్న ఉక్రెయిన్‌కు అమెరికా మరోసారి ఆపన్న హస్తాన్ని అందించింది. ఉక్రెయిన్‌కు రూ.16వేల కోట్ల సైనిక సహాయక ప్యాకేజీని అందిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రకటించారు. రెండు రోజుల ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న బ్లింకెన్.. చివరి రోజైన బుధవారం రాజధాని కీవ్‌లో సహాయక ప్యాకేజీపై ప్రకటన చేశారు. రష్యాతో యుద్ధం వేళ ఉక్రెయిన్ రెడీ చేసుకున్న ధాన్యం ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌకర్యం, బయోనిక్స్ కర్మాగారం, డ్రోన్ తయారీ కేంద్రాలను ఆంటోనీ బ్లింకెన్ సందర్శించారు. కష్టకాలంలో ఉక్రెయిన్ సమయోచితంగా వ్యవహరిస్తోందని ఆయన కితాబిచ్చారు. రష్యా దండయాత్ర మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌కు సంబంధించిన అంతర్జాతీయ షిప్పింగ్ రూట్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రైలు మార్గాల ద్వారా ఉక్రెయిన్ నుంచి ఇరుగుపొరుగు దేశాలకు ధాన్యం ఎగుమతులు చేస్తున్నారు. ఉక్రెయిన్‌పై దాడులను రష్యా తీవ్రతరం చేసిన నేపథ్యంలో దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తన విదేశీ పర్యటనల షెడ్యూల్‌ను ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నారు.