- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎన్నికల్లో AI తో జాగ్రత్త: సీఈఓ సిమోనా వాసైట్
దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్నికలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని చాలా మంది నిపుణులు, రాజకీయ నాయకులు ఆందోళన చేస్తుండగా, తాజాగా ప్రముఖ AI కంపెనీ Perfection42 సీఈఓ సిమోనా వాసైట్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కృత్రిమ మేధస్సు (AI) సాధనాల ద్వారా సృష్టించబడిన డీప్‌ఫేక్‌లు పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉందని అన్నారు. దీనిని నియంత్రించకపోతే USలో ఈ సాంకేతికత "ప్రజాస్వామ్యానికి ముప్పు" కలిగిస్తుందని హెచ్చరించారు.
ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి నాయకుల పేరిట తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే అవకాశం ఉంది. ఇటీవల ఉక్రెయిన్ ప్రెసిడెంట్ బాంబులు వేయమని తన సైనికులను ఆదేశించిన వీడియోను చూశాను. ఇది ఫేక్ వీడియో. ఇలాంటి వాటివల్ల చాలా పెద్ద అనర్ధాలు వస్తాయి. అలాగే, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది టిక్‌టాక్‌లో నకిలీ వీడియోలతో ఎన్నికలలో ఓటు వేయవద్దని యువ ఓటర్లను ప్రోత్సహిస్తున్నారు. ఈ డీప్‌ఫేక్ ఫొటోలు, వీడియోలు ప్రజాస్వామ్య దేశానికి అతిపెద్ద ముప్పుగా పరిగణించాయి, వీటి కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఈఓ అన్నారు.