Bangladesh : బంగ్లా ప్రధాని నివాసం లూటీ..! సెల్ఫీలు, భోజనాలు.. ఇంకెన్నో సిత్రాలు!

by Ramesh N |   ( Updated:2024-08-05 13:31:52.0  )
Bangladesh : బంగ్లా ప్రధాని నివాసం లూటీ..!  సెల్ఫీలు, భోజనాలు.. ఇంకెన్నో సిత్రాలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా పదవికి రాజీనామా చేసి ఆ దేశం విడిచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. వందల మంది నిరసనకారులు ప్రధాని అధికారిక నివాసాన్ని ముట్టడి చేయడంతో, షేక్‌ హసీనా మిలటరీ హెలికాప్టర్‌లో ఎక్కి తప్పించుకోవాల్సి వచ్చింది. ఆమెతో పాటు ఆమె చెల్లెలు షేక్ రెహానా కూడా ఉన్నారు. అయితే, అందోళనకారులు బంగ్లాదేశ్ జెండాలు ఊపుతూ ఢాకాలోని ప్రధాని అధికారిక నివాసం గణభవన్‌ను చుట్టుముట్టారు. ఈ సందర్భంగా నిరసనకారులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

పార్లమెంట్‌లో సెల్ఫీలు, స్మోక్ బాంబులు

అధికార నివాసంలోకి బలవంతంగా ప్రవేశించిన ఆందోళనకారులు ఇంట్లో ఉన్న వస్తువులను అందిన కాడికి దోచుకోనిపోయారు. చీరలు, దుప్పట్లు, పాత్రలు ఇతర వస్తువులను ఎత్తుకుపోయారు. మరోవైపు కొంతమంది ఇంట్లో ఉన్న ఖరీదైన కుర్చీలు, మంచాలపై సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు. మరికొంత మంది అప్పుడే కిచెన్‌లో ఆహారం రెడీగా ఉండడంతో కొందరు భోజనాలు ఎగబడి చేశారు. మరోవైపు బంగ్లాదేశ్ పార్లమెంట్‌లోకి కూడా నిరసన కారులు చొరబడి సెల్ఫీలు తీసుకుంటున్నారు. స్మోక్ బాంబులు విసిరారు. కొందరు కూర్చీల్లో కూర్చోని ప్రమాణస్వీకారం చేస్తున్నట్లు వీడియోలు తీసుకున్నారు.

మొన్న శ్రీలంక.. నేడు బంగ్లాదేశ్!

ఈ వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. శ్రీలంకలో సంక్షోభం ఏర్పడటం వల్ల అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పదవి నుంచి దిగిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టారు. దీంతో ఆయన దేశం విడిచి పోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనూ నిరసనకారులు అధ్యక్ష భవనం కిచెన్‌లోకి ప్రవేశించి అక్కడి ఆహార పదార్థాలను తింటూ కనిపించారు. కొందరు భవనంలోని స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొట్టారు. సెల్ఫీలు దిగారు. మరోవైపు అఫ్గానిస్తాన్‌లో కూడా తాలిబన్లు ఇలానే అక్కడ తిరుబాటు చేసిన ఘటనలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. అఫ్గానిస్తాన్‌, శ్రీలంక, మయన్మార్ పరిస్థితులను నెటిజన్స్ గుర్తుచేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed