Bangladesh : షేక్ హసీనాకు మరో బిగ్ షాక్..!

by Maddikunta Saikiran |
Bangladesh : షేక్ హసీనాకు మరో బిగ్ షాక్..!
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీలీగ్ పార్టీ అధ్యక్షురాలు షేక్ హసీనాకు పెద్ద షాక్ తగిలింది. ఇప్పటికే ఆమెపై ఓ హత్య కేసు నమోదు కాగా, తాజాగా మరో హత్య కేసు నమోదైంది.వివరాల్లోకెళ్తే.. హసీనా తన పదవికి రాజీనామా చేయడానికి ముందు విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో 35 ఏళ్ల సెలిమ్ హోసెన్ అనే ఉపాద్యాయుడు పాల్గొన్నాడు.సెలిమ్ హోసెన్ ఈ ఆందోళనలో పాలు పంచుకున్నందుకు అవామీలీగ్ కార్యకర్తలు అతనిపై పదునైన ఆయుధాలతో దాడి చేసి అతన్ని చంపేశారు.అవామీలీగ్ కార్యకర్తలు హసీనా ఆదేశాలతోనే తన అన్నను ఘోరంగా హత్య చేశారని మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో షేక్ హసీనాపై హత్య అభియోగం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇదివరకే ఆమెపై కిరాణా దుకాణం యజమాని హత్యకు సంభందించి కేసు నమోదయిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed