'భారత్ స్వతంత్ర దేశం'.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

by Vinod kumar |
భారత్ స్వతంత్ర దేశం.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
X

సోచి: మాస్కో-న్యూఢిల్లీ మధ్య విబేధాలు సృష్టించేందుకు పాశ్చాత్య దేశాలు చేస్తున్న ప్రయత్నాలు అర్థ రహితమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. పాశ్చాత్య దేశాలు తమ గుత్తాధిపత్యాన్ని అంగీకరించని ప్రతి ఒక్కరినీ శత్రువుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపిన పుతిన్.. ఇండియా సహా ప్రతి ఒక్కరూ ప్రమాదంలో ఉన్నారన్నారు. కానీ భారతదేశ నాయకత్వం తన దేశ ప్రయోజనాల కోసం స్వతంత్రంగా వ్యవహరిస్తోంది’ అని సోచి, రష్యన్ బ్లాక్ సీ రిసార్ట్ ప్రసంగంలో పుతిన్ పేర్కొన్నారు. రష్యా నుంచి భారత్‌ను దూరం చేసే ప్రయత్నాలు అర్థరహితమని, భారత్‌ స్వతంత్ర దేశమని అభిప్రాయపడ్డారు.

పాశ్చాత్య దేశాలు ఆ దేశంపై ఆంక్షలు విధించిన తర్వాత రాయితీతో రష్యా చమురును కొనుగోలు చేయడంపై భారతీయ రిఫైనర్లు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడంతో అమెరికా, యూరోపియన్ యూనియన్లు రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేశాయి. ఇదిలా ఉంటే.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం మరింత పటిష్టంగా అభివృద్ధి చెందుతోందని పుతిన్‌ ప్రశంసలు కురిపించారు. రష్యా మాదిరిగానే భారత్‌కు కూడా సరిహద్దులు లేవని ఆయన అన్నారు.

Advertisement

Next Story