Ratan Tata: తన ఆరోగ్యంపై వస్తున్నవన్నీ పుకార్లే: రతన్ టాటా

by S Gopi |
Ratan Tata: తన ఆరోగ్యంపై వస్తున్నవన్నీ పుకార్లే: రతన్ టాటా
X

దిశ, బిజినెస్ బ్యూరో: టాటా సన్స్ మాజీ ఛైర్మన్, పారిశ్రామికవేత్త రతన్ టాటా ఆసుపత్రికి వెళ్లారు. బీపీ తగ్గడం వల్ల ఆయన సోమవారం ఆసుపత్రికి వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. పరిస్థితి విషమంగా ఉందంటూ, ఉదయం 12 గంటల ప్రాంతంలో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి వెళ్లినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీనిపై అనేక ఊహాగానాలు రావడంతో రతన్ టాటా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశం పోస్ట్ చేశారు. వయసు కారణంగా తాను సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్నానని, ఆందోళన చెందాల్సిన అవసరంలేదని హామీ ఇచ్చారు. 'తన ఆరోగ్యంపై పుకార్లు వ్యాపించినట్టు తెలిసింది. అవన్నీ నిరాధారమైనవి. ఇప్పటికీ తాను ఉత్సాహంగానే ఉన్నానని, తన ఆరోగ్యం గురించి భయపడాల్సింది ఏమీ లేదని ' పోస్టులో పేర్కొన్నారు. తన గురించి ఆలోచించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని ఎక్స్‌లో క్యాప్షన్ పెట్టారు.

Next Story

Most Viewed