Telangana BJP: బీఆర్ఎస్ పాలనలో అంతులేని కుంభకోణాలు

by Gantepaka Srikanth |
Telangana BJP: బీఆర్ఎస్ పాలనలో అంతులేని కుంభకోణాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం కుంభకోణం, మిషన్ భగీరథ స్కామ్, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కామ్, ఇసుక కుంభకోణం, మియాపూర్ భూ కుంభకోణం, బతుకమ్మ నిధుల కుంభకోణం, పవర్ ప్రాజెక్ట్స్ స్కామ్, గొర్రెల కుంభకోణం జరిగాయని తెలంగాణ బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఎక్స్‌లో సోమవారం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తెలంగాణ బీజేపీ ఆసక్తికర పోస్ట్ చేసింది. కేసీఆర్/కేటీఆర్ తప్పుడు పాలనలో అంతులేని కుంభకోణాలతో తెలంగాణ ప్రజలను ఎండగట్టిందన్నారు.

నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా కేసీఆర్‌/కేటీఆర్‌ దుర్మార్గాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నది. స్పష్టంగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ భాయ్ భాయ్ భాగస్వామ్యం అభివృద్ధి చెందుతుందని విమర్శించింది. పరస్పర ప్రయోజనం ఏదైనా గొప్ప బ్రొమాన్స్‌కి పునాది అంటూ సెటైర్లు వేసింది. ఈ క్రమంలోనే ఒక లాకెట్‌పై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేటీఆర్ ఉన్న ఫొటోని తెలంగాణ బీజేపీ అధికార ఖాతా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement

Next Story