డిప్యూటీ సీఎం నివాసంలో ఫర్నీచర్ మిస్సింగ్

by Mahesh Kanagandla |
డిప్యూటీ సీఎం నివాసంలో ఫర్నీచర్ మిస్సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ ఎమ్మెల్యే తేజస్వీ యాదవ్ ఉపముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. ప్రస్తుత ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఈ నవరాత్రికి రానున్నారు. ఈ నేపథ్యంలోనే బిహార్ బీజేపీ తేజస్వీ యాదవ్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. తేజస్వీ యాదవ్ ఖాళీ చేసిన అధికారిక నివాసంలో సోఫాలు, నీటి కుళాయిలు, వాష్ బేసిన్లు, ఏసీలు, లైట్లు, బెడ్లు కనిపించడం లేదని పేర్కొంది. వాటన్నింటినీ తేజస్వీ యాదవ్ దొంగిలించినట్టుగా చిత్రించింది. నితీశ్ కుమార్‌ పార్టీతో పొత్తులో ఉండగా తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అప్పుడు పాట్నాలోని దేష్‌రతన్ 5లోని డిప్యూటీ సీఎం బంగ్లాలో ఉండేవారు. కానీ, నితీశ్ కుమార్ బీజేపీతో చేతులు కలపడంతో తేజస్వీ యాదవ్ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మారిపోయారు. ఈ విజయదశమి సందర్భంగా ప్రస్తుత డిప్యూటీ సీఎం అధికారిక నివాసంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పర్సనల్ సెక్రెటరీ శత్రుగన్ ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు.

‘డిప్యూటీ సీఎం బంగ్లాలోని వస్తువులను ఎలా దొంగిలించారో వెలుగులోకి తెస్తున్నాం. సుశీల్ మోడీ ఈ బంగ్లాలో ఉన్నప్పుడు రెండు హైడ్రాలిక్ బెడ్లు, అతిథుల కోసం సోఫా సెట్లు ఉండేవి. ఎక్కడ చూసినా అవే ఉండేవి. కానీ, ఇప్పుడు అవన్నీ కనిపించడం లేదు’ అని శత్రుగన్ ప్రసాద్ వివరించారు. ‘20కి మించి స్ప్లిట్ ఏసీలు మిస్ అయ్యాయి. ఆపరేటింగ్ రూమ్‌లో కంప్యూటర్ లేదు, చైర్ కూడా లేదు. ఫ్రిడ్జీ లేదు, కిచెన్‌లో ఆర్‌వో కూడా లేదు. గోడల నుంచి లైట్లను పెరికేశారు’ అని చెప్పారు. కాగా, ఈ ఆరోపణలను ఆర్జేడీ ఖండించింది. భవన్ నిర్మాన్ విభాగ్ నుంచి ఇన్వెంటరీ తెప్పించాలని, లేదంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.

డిప్యూటీ సీఎం నివాసంలో ఫర్నీచర్ మిస్సింగ్

ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఈ నెల 4వ తేదీన ఢిల్లీలో ఫ్లాగ్‌స్టాఫ్‌లోని సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. లూట్యేన్స్ ఏరియాలోని బంగ్లాకు మారారు. సీఎం అధికారిక నివాసాన్ని ఆయన ఖాళీ చేశారు గానీ, ఆ బంగ్లా తాళంచెవిని అధికారులకు అప్పగించలేదు. ఆ కీస్ అందించాలని అరవింద్ కేజ్రీవాల్‌కు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఓ లేఖ రాశారు. సీఎంవో స్పెషల్ సెక్రెటరీ ప్రవేశ్ రంజన్ ఝాకు పీడబ్ల్యూడీ రాసిన ఈ లేఖలో సీఎం అధికారిక నివాస తాళం చెవిని కేజ్రీవాల్ తమకు రిటర్న్ చేయలేదని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed