- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Zakir Naik : జాకిర్ నాయక్‌కు షాక్.. క్షమాపణ చెప్పేది లేదన్న యువతి
దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్ పర్యటనలో ఉన్న వివాదాస్పద మత ప్రబోధకుడు జాకిర్ నాయక్‌కు షాక్ తగిలింది. కరాచీలో జరిగిన మత ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రశ్న-జవాబుల సెషన్‌లో జాకిర్‌ను ఓ యువతి వివాదాస్పద ప్రశ్న అడిగింది. ‘‘మేం ఉండే ఏరియాలో ముస్లింలే పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ వ్యభిచారం, పిల్లలపై లైంగిక వేధింపులు, డ్రగ్స్ వినియోగం చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిని ఆపేందుకు ముస్లిం మతపెద్దలు ఎందుకు ప్రయత్నించడం లేదు ?’’ అని సదరు యువతి ప్రశ్నించింది.
ఈ ప్రశ్నను విన్న జాకిర్.. ‘‘మీరు అడిగిన ప్రశ్న తప్పు. అందుకోసం క్షమాపణ చెప్పండి. ఎందుకంటే మీరు అక్కడున్న అందరినీ ఒకేగాటన కట్టి తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు’’ అని సూచించారు. అయితే అందుకు సదరు యువతి ససేమిరా అని తేల్చి చెప్పింది. దీంతో కొంత అసహనానికి గురైన జాకిర్ నాయక్ ఆ ప్రశ్నకు జవాబిస్తూ.. ‘‘వ్యభిచారం, పిల్లలపై లైంగిక వేధింపులు, డ్రగ్స్ వినియోగం లాంటి అంశాలకు ఇస్లాం వ్యతిరేకం. ఇస్లాం ఉన్నచోట అలాంటివి అస్సలు ఉండవు’’ అని చెప్పి తన సమాధానాన్ని ముగించారు.