ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులకు షాక్ ఇచ్చిన కోర్ట్

by M.Rajitha |
ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులకు షాక్ ఇచ్చిన కోర్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అనుచరులకు, మద్దతుదారులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తమ నాయకునికి మద్దతుగా ఇటీవల లాహోర్ లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు నిరసన ప్రదర్శనలు చేశారు. కాగా ఈ నిరసనలకు పోలీసులు అడ్డు చెప్పడంతో.. కోపంతో రెచ్చిపోయిన నిరసనకారులు, పోలీసులపై దాడులకు దిగారు. ఈ దాడులపై నిరసనకారుల మీద భారీగా కేసులు నమోదు చేసి అరెస్టులు చేశారు. ఈ కేసును విచారించిన ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం.. పాకిస్థాన్ తెహ్రిక్-ఏ-ఇన్సఫ్ కు చెందిన 130 మందికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం పాక్ రాజకీయాల్లో దుమారాన్ని రేపుతోంది. కాగా పాక్ మాజీ ప్రధాని పలు కేసుల నేపథ్యంలో జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

Advertisement

Next Story