- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఉక్రెయిన్‌కు ఆయుధాల పంపిణీ వేగవంతం చేయాలి: జెలెన్ స్కీ విజ్ఞప్తి
దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్‌కు ఆయుధాల పంపిణీని వేగవంతం చేయాలని తమ భాగస్వాములకు అధ్యక్షుడు జెలెన్ స్కీ విజ్ఞప్తి చేశారు. తమకు ఆయుధాలు తక్షణ అవసరమని నొక్కి చెప్పారు. అనేక విభాగాలలో ముందుకు సాగుతున్న రష్యన్ దళాలను ఎదుర్కొనేందుకు ఇవి ఎంతో తోడ్పడతాయని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశంలో మాట్లాడారు. ఉక్రెయిన్ సైనికుల సామర్థ్యాలు పెంచడానికి ఆయుధాల సరఫరా వేగవంతం చేయాలని తెలిపారు. రష్యా ఎక్కడ తీవ్రంగా దాడులు చేస్తుందో ఆ ప్రాంతాల్లో ఎదుర్కోవడానికి తగినన్ని ఆయుధాలు అవసరం ఉందని స్పష్టం చేశారు. కీలక స్థావరాల వద్ద పరిస్థితిని చక్కదిద్దాలని చెప్పారు.
రష్యా-ఉక్రెయిన్ రెండేళ్ళ యుద్ధంలో ఉక్రెయిన్ దళాలు కొన్ని అత్యంత తీవ్రమైన గ్రామాల నుంచి వెనక్కి తగ్గాయని ఉక్రెయిన్ టాప్ కమాండర్ అంగీకరించిన నేపథ్యంలో జెలెన్ స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో అవిడిక్కా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత తమ బలగాలు తూర్పున అనేక గ్రామాలను స్వాధీనం చేసుకున్నాయని రష్యా పేర్కొంది. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా ఒడెసాలోని ప్రముఖ సముద్రతీర ఉద్యానవనంలో రష్యా క్షిఫణి దాడి చేయగా ఐదుగురు మరణించగా..32 మంది గాయపడ్డారు. అలాగే ఈ దాడిలో హ్యారీ పోటర్ కోట ధ్వంసమైనట్టు తెలుస్తోంది.