- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పిల్లలపై కోపంతో 23 కోట్ల ఆస్తిని కుక్కలు, పిల్లులపై రాసిన మహిళ.. ఎక్కడో తెలుసా?
దిశ, ఫీచర్స్: తల్లిదండ్రులు పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎంతో గారాబంగా పెంచుతున్నారు. స్టడీ, ఉద్యోగ రీత్యా దూరంగా ఉంటే.. తమ పిల్లలు టచ్‌లో ఉండాలని, వారి ఆరోగ్యం గురించి పట్టించుకోవాలని, తరచూ ఇంటి దగ్గరికి వచ్చి వెళ్లాలని, రోజూ ఫోన్ చేసి మాట్లాడాలని తల్లిదండ్రులు పరితపిస్తారు. కానీ ఎంతో మంది పిల్లలు.. వారి రెస్పాన్సిబిలిటీస్ పెరిగేకొద్దీ, వారు తమ కుటుంబాలను ఏర్పరచుకున్న తర్వాత పేరెంట్స్‌ను పూర్తిగా మర్చిపోతున్నారు. తల్లిదండ్రుల్ని కేవలం ఆదాయ వనరుగా భావిస్తున్నారు. ఆస్తి మొత్తం తమకే రాసివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పిల్లల కోరిక మేరకు పేరెంట్స్ ఆస్తి రాసి ఇస్తున్నారు. కానీ తర్వాత వృద్ధులను సుఖంగా చూసుకోవడం లేదు.
తల్లిదండ్రుల్ని రోడ్డు మీద వదిలేసిన కొడుకులు ఎంతో మంది ఉన్నారు. కొందరైతే ముసలి వారిని కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు. ఇలా పిల్లల ప్రవర్తన పేరెంట్స్ మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే చైనాలో జరిగింది. లియు అనే ఓ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. తమ పిల్లలు ఆమెకు దూరంగా ఉంటున్నారు. లియు రీసెంట్‌గా అనారోగ్యానికి గురైంది. ఈ విషయాన్ని తమ పిల్లలకు తెలుపగా వారు లియును చూడానికి రాలేదు. పిల్లల ప్రవర్తనతో ఈ మహిళ పూర్తిగా కృంగిపోయి.. ఆమె ఇంట్లో ఉండే పెంపుడు కుక్క, పిల్లులపై తన ఆస్తి మొత్తం రాసిచ్చింది. ఎందుకంటే లియు చివరి క్షణాల వరకు ఈ జంతువులు ఆమెతోనే ఉన్నాయి. లియు మరణించాక పిల్లలు ఇంటికొచ్చి.. ఆస్తి విషయం తెలుసుకున్నాక ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని చూశారు.
లియు చనిపోయే ముందు.. చైనాలో జంతువుల పేరుతో డైరెక్ట్ మనీ బదిలీ చేయడం లేదు. కాబట్టి లియు పశువైద్యులను జంతు సంరక్షకులుగా మార్చింది. జంతువులను కేర్‌ఫుల్‌గా చూసుకోవడానికి తమ ఆస్తి మొత్తం జంతువులకు ఖర్చు పెట్టే అధికారం ఉందని తెలిపింది. లియు ఆస్తుల విలువ మొత్తం 2.8 మిలియన్లకు పైగా ఉంటుంది. అంటే రూ. 23 కోట్ల 27 లక్షల 16 వేల రూపాయలు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ‘‘పిల్లలకు సరైన బుద్ధి చెప్పారు అమ్మా’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.