- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మెదడులో బుల్లెట్ పెట్టుకొని 4 రోజులు ఎంజాయ్ చేసిన యువకుడు.. ఆపరేషన్‌కు ముందు షాకైన డాక్టర్లు
దిశ, ఫీచర్స్: ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొందరు మినహా అందరూ అజాగ్రత్తగానే ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడంలో తెలిసి కూడా నిర్లక్ష్యం వహిస్తుంటారు. కొందరైతే ప్రాణాపాయం అని తెలిసినా కూడా అదే తరహాలో ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా కొందరు అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ఇష్టానుసారం నడుచుకుంటుంటారు. తాజాగా.. ఇలాంటి ఘటనే ఫారెన్‌లో చోటుచేసుకుంది.
బ్రెజిల్‌లో మెడిసిన్ చదువుతున్న 21 ఏళ్ల విద్యార్థి ఇటీవల స్నేహితులతో కలిసి పార్టీ సెలబ్రేట్ చేసుకున్నాడు. అక్కడ మ్యూజిక్, బాణసంచాతో బీచ్ పార్టీ నిర్వహించారు. బీచ్‌లో సరదాగా గడుపుతుండగా అతడి తలకు ఏదో బలంగా తగిలింది. మత్తులో ఉన్న సదరు విద్యార్థి తగిలిన దెబ్బను లెక్కచేయకుండా ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత కొద్దిసేపు ఆలోచించి పరిశీలించి చూశాడు. అది ఫైర్ క్రాకర్ కాదని తుపాకీ నుంచి వచ్చిన ఓ బుల్లెట్ అని గుర్తించారు. ఈ బుల్లెట్ మెదడులోకి వెళ్లి అక్కడే ఉండిపోయింది.
అయితే, నొప్పి లేకపోవడంతో అతడు ఆసుపత్రికి కూడా వెళ్లలేదు. ఎంచక్కా మరో నాలుగు రోజుల పాటు పార్టీలో సెలబ్రేషన్స్ కొనసాగించాడు. సముద్రంలో ఈదాడు, స్నేహితులతో కలిసి చిల్ అయ్యాడు. నాలుగు రోజుల తర్వాత ఇంటికి వెళ్లిన అతనిలో వణుకు మొదలైంది. దాంతో భయం వేసి ఆసుపత్రికి వెళ్ళాడు. ఆసుపత్రిలో వైద్యులు కొన్ని పరీక్షలు చేసి, మెదడులో బుల్లెట్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స అవసరమని చెప్పారు. దాదాపు రెండు గంటలు శ్రమించి శస్త్రచికిత్స ద్వారా బుల్లెట్‌ను బయటకు తీశారు. శస్త్రచికిత్స విజయవంతమైంది. పోలీసులు ఆసుపత్రికి వచ్చి బుల్లెట్ తీసుకున్నారు. ఎవరు ఈ బుల్లెట్ కాల్చారో ఆరా తీస్తున్నారు.