Video Viral:షాకింగ్ ఘటన..సముద్రంలో బోటు పై ఎగిరిపడ్డ భారీ తిమింగలం!

by Jakkula Mamatha |
Video Viral:షాకింగ్ ఘటన..సముద్రంలో బోటు పై ఎగిరిపడ్డ భారీ తిమింగలం!
X

దిశ,వెబ్‌డెస్క్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వింతలు, విశేషాలకు కొదువే లేకుండా పోయింది. తాజాగా ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. అమెరికాలోని న్యూహాంప్‌షైర్‌‌లో ఓ సముద్రంలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. 23 అడుగుల సెంటర్‌ కన్సోల్‌ బోట్‌లో ఇద్దరు వ్యక్తులు మంగళవారం ఉదయం చేపల వేటకై సముద్రంలోకి వెళ్లారు. అమెరికాలోని ప్రోట్స్‌మౌత్‌ హార్బర్‌ సముద్రంలో ఓ భారీ తిమింగలం చేపల వేట పడవ పై దాడి చేసింది. ఆ భారీ తిమింగలం ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి బోటుపై పడింది. దీంతో పడవ బోల్తా పడింది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన బోటులోని ఇద్దరి వ్యక్తుల్లో ఒకరు సముద్రంలోకి దూకేశారు. మరో వ్యక్తి నీటిలో మునిగిపోయారు. ఇదంతా గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని సురక్షితంగా కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement

Next Story