సెంట్రల్ పెరూ తీరంలో భూకంపం.. సునామీ హెచ్చరిక..

by Harish |
సెంట్రల్ పెరూ తీరంలో భూకంపం.. సునామీ హెచ్చరిక..
X

దిశ, నేషనల్ బ్యూరో: సెంట్రల్ పెరూ తీరంలో శుక్రవారం భూకంపం సంభవించింది. అతిక్విపా జిల్లాకు 8.8 కిలోమీటర్లు (5.5 మైళ్లు) దూరంలో 7.2 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు సమీప ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. ప్రారంభంలో తీవ్రత బలంగా ఉండటంతో సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు మొదట భావించారు. అయితే ఆ తర్వాత తీవ్రత తగ్గడంతో సునామీ హెచ్చరికలను విరమించుకున్నారు. భూకంప కేంద్రానికి సమీపంలోని ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు రావడంతో, స్థానికులు, అధికారులు ఆందోళన చెందారు.

భూకంప ప్రకంపనల కారణంగా సమీప ప్రాంతాల్లోని కొన్ని భవనాలు, రోడ్లు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం పరిస్థితులను అధికారులు క్షణ్ణంగా గమనిస్తున్నారు. సముద్ర తీరానికి సమీపంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని వారు పేర్కొన్నారు. భూకంపం కారణంగా ప్రభావితమైన వారికి సహాయం చేయడానికి అత్యవసర సేవలు సిద్ధంగా ఉన్నాయి. నివాసితులు భద్రతా మార్గదర్శకాలు పాటించాలని అధికారులు కోరారు. పెరూ దేశం దక్షిణ అమెరికా వాయువ్య భాగంలో ఉంటుంది. దీనిలో దాదాపు దాదాపు 33 మిలియన్ల మంది ఉంటారు. భూకంపం సంభవించే ప్రాంతాల్లో పెరూ కూడా ఒకటిగా ఉంది.

Next Story

Most Viewed