Israel-Gaza: చర్చలకు ఒకే అంటూనే.. మరోవైపు దాడులు

by Harish |
Israel-Gaza: చర్చలకు ఒకే అంటూనే.. మరోవైపు దాడులు
X

దిశ, నేషనల్ బ్యూరో: మిడిల్‌ఈస్ట్‌లో యుద్ధ వాతావరణం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఒకవైపు చర్చలకు ఒకే అంటూనే ఇజ్రాయెల్.. హమాస్ అంతమే లక్ష్యంగా ప్రధాన నగరమైన గాజాపై దాడులు చేస్తూనే ఉంది. తాజాగా పాలస్తీనా భూభాగానికి దక్షిణాన ప్రజలు ఆశ్రయం పొందుతున్న ప్రాంతంపై ఇజ్రాయెల్ దళాలు దాడులు చేయడంతో దాదాపు 40 మంది మరణించారు, అలాగే మరో 60 మంది గాయపడ్డారని గాజా పౌర రక్షణ ఏజెన్సీ మంగళవారం తెలిపింది.

యుద్ధం ప్రారంభంలో ఖాన్ యునిస్‌లోని అల్-మవాసీని సురక్షితమైన ప్రాంతంగా గుర్తించగా, యుద్ధంలో నష్టపోయిన అనేక మంది నిరాశ్రయులు అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. అక్కడ దాడులు చేయమని ప్రకటించినప్పటికీ కూడా ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసిందని స్థానిక అధికారులు తెలిపారు. అయితే ఈ దాడులపై స్పందించిన ఇజ్రాయెల్ ఆ ప్రాంతంలోని హమాస్ కమాండ్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు పేర్కొంది.

దాదాపు పదివేల మంది పాలస్తీనియన్లు అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. ఇజ్రాయెల్ సైన్యం అప్పుడప్పుడు ఆ ప్రాంతంలో, చుట్టుపక్కల దాడులను నిర్వహిస్తుందని గాజా సివిల్ డిఫెన్స్ అధికారి మహ్మద్ అల్-ముఘైర్ మంగళవారం తెలిపారు. తాజా దాడుల్లో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించాం, అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన చెప్పారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే శిబిరాలపై దాడులు చేశారు. 20 నుండి 40 కంటే ఎక్కువ టెంట్లు పూర్తిగా దెబ్బతిన్నాయని అధికారి తెలిపారు. దాడులు జరిగిన ప్రాంతంలో మిలిటెంట్లు ఉన్నారన్న ఇజ్రాయెల్ వాదనలను “పచ్చి అబద్ధం” అని హమాస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed