బంగ్లా అల్లర్ల మృతులు 1000 మంది.. ప్రకటించిన ప్రభుత్వం

by M.Rajitha |
బంగ్లా అల్లర్ల మృతులు 1000 మంది.. ప్రకటించిన ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్ : గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్ లో చెలరేగిన అల్లర్ల వలన ఆ దేశంలో 1000 మందికి పైగా మరణించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. గత జూలై, ఆగస్టులో రిజర్వేషన్స్ లోని ప్రత్యేక కోటా గురించి మొదలైన నిరసనలు క్రమంగా దేశవ్యాప్త అల్లర్లకు దారి తీసాయి. అల్లర్ల వలన బంగ్లా ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, దేశం విడిచి పారిపోయారు. కాగా ఈ హింసాత్మక అల్లర్ల వలన ఆ దేశంలో 1000 మందికి పైగా మరణించినట్టు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ఆరోగ్య సలహాదారురాలు నూర్జహాన్ బేగం ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే 400 మందికి పైగా రబ్బరు బుల్లెట్ల వలన చూపు కోల్పోయారని అన్నారు. నేడు నూర్జహాన్ ఢాకాలోని రాజర్ భాగ్ లోని కేంద్ర పోలీసు ఆస్పత్రిని సందర్శించారు. బాదితులను పరామర్శించిన అనంతరం గాయాలపాలైన వారికి నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

Next Story

Most Viewed