Sri Lanka : శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో 75 శాతం పోలింగ్.. రేపే ఫలితం

by Hajipasha |
Sri Lanka : శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో 75 శాతం పోలింగ్.. రేపే ఫలితం
X

దిశ, నేషనల్ బ్యూరో : శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రక్రియ శనివారం ప్రశాంతంగా ముగిసింది. దేశంలో దాదాపు 1.70 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 75 శాతం పోలింగ్ నమోదైందని శ్రీలంక ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ ఎన్నికల కోసం బ్యాలెట్ బాక్సు పద్ధతిని వినియోగించారు. శనివారం సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఆ సమయానికి క్యూ లైన్లలో ఉన్నవారందరికీ 4 గంటల తర్వాత కూడా ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. ఎన్నికల ఫలితాలు ఆదివారం రోజే వెల్లడికానున్నాయి. 2022 సంవత్సరంలో శ్రీలంక ఆర్థికంగా దివాలా తీసింది.

దీంతో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) శ్రీలంకకు రుణ పునర్ వ్యవస్థీకరణ ప్రణాళికను మంజూరు చేసింది. ఆ గడ్డుకాలాన్ని ఎదురీదిన తర్వాత శ్రీలంకలో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలు ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. రణిల్ విక్రమసింఘే ప్రభుత్వాన్ని లంక ప్రజలు కొనసాగిస్తారా ? తిరస్కరిస్తారా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో రణిల్ విక్రమసింఘేకు ప్రధాన పోటీదారులుగా అనుర కుమార దిస్సనాయకే, సజిత్ ప్రేమదాస ఉన్నారు.

Advertisement

Next Story