- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్లోర్ క్లీనర్ నుంచి సెలబ్రిటీగా ఎదిగాడు.. అతడి ప్రయాణం విభిన్నం
దిశ, ఫీచర్స్ : చేతుల్లో పాంప్లెట్స్ పట్టుకుని వీధుల్లో తిరిగే రోజుల నుంచి సెలబ్రిటీల చేతులపై పచ్చబొట్టు వేసేంతవరకు అతడి ప్రయాణం విభిన్నం. ఒకప్పుడు వంద రూపాయల ప్యాకెట్ మనీ కోసం రోజంతా కష్టపడ్డ అతడు.. నేడు నిముషాల్లో లక్షల రూపాయలను సంపాదించే స్థాయికి ఎదిగాడు. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఫ్లోర్ క్లీనర్‌గా పనిచేసిన ఆ వ్యక్తి.. ఇప్పుడు ప్రపంచ దేశాలను చుట్టేస్తున్నాడు. ‘హార్ట్‌వర్క్ టాటూ ఫెస్టివల్’ పేరుతో ఇండియాలోనే బిగ్గెస్ట్ టాటూ కన్వెన్షన్ మొదలుపెట్టి సెలబ్రిటీ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో తన ఆర్ట్ వర్క్‌తో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ స్థానం సంపాదించుకున్న లోకేష్ వర్మ లైఫ్ స్టోరీ విశేషాలు..
ఢిల్లీకి చెందిన లోకేష్ వర్మ తల్లి హోమ్ మేకర్ కాగా, తండ్రి ఆర్మీ సోల్జర్. లోయర్ మిడిల్ క్లాస్‌లో పుట్టి పెరిగిన లోకేష్.. తన స్కూలింగ్ పూర్తి చేశాక, కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఏ పని చేయడానికైనా సిద్ధపడ్డాడు. ఈ క్రమంలో వీధుల్లో కరపత్రాలను పంపిణీ చేయడంతో పాటు డయల్-అప్ ఇంటర్నెట్ సీడీలను ఇంటింటికీ తిరిగి అమ్మేవాడు. ఢిల్లీ యూనివర్సిటీలోని శ్రీ అరబిందో కళాశాలలో బీ.కామ్ చేస్తున్నప్పుడు కూడా తన పార్ట్‌టైమ్ వర్క్ కొనసాగించాడు. ఉదయం పూట మెక్‌డొనాల్డ్స్‌లో బాత్‌రూమ్, ఫ్లోర్ క్లీనర్‌గా పనిచేస్తూ ఆ తర్వాత సీడీలు అమ్మేందుకు వెళ్లేవాడు. నైట్ టైమ్‌లో స్థానిక బార్‌లో డీజేగా చేసేవాడు. ఇలా రోజూ మూడు ఉద్యోగాలు చేస్తూనే లోకేష్ పీజీ వరకు చదివాడు.
ఆర్ట్ జర్నీ..
లోకేష్ ఆరో తరగతిలో ఉన్నప్పటి నుంచే బొమ్మలు గీయడంలో ప్రతిభ చూపేవాడు. 14ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు జపాన్‌లో జరిగిన ఇంటర్-ఆసియా స్థాయి పెయింటింగ్ పోటీల్లో పాల్గొని మొదటి స్థానాన్ని గెలుచుకున్నాడు. పీజీ చదువుతుండగా టూటూలు చూసి ఆకర్షితుడైన లోకేష్.. ఈ క్రమంలోనే తన పాకెట్ మనీ సేవ్ చేసి ఓ టాటూ మెషిన్ కొన్నాడు. వారాంతాల్లో సొంతంగా టాటూలు వేయడం నేర్చుకుని, మొట్టమొదట తన తండ్రికే పచ్చబొట్టు వేశాడు. ఆ తర్వాత తన శరీరంపైనే ప్రయోగాలు చేస్తూ, అతి తక్కువ కాలంలోనే ఢిల్లీలో ది బెస్ట్ టాటూ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. తన టాటూ కళకు మరిన్ని మెరుగులు దిద్దుకునేందుకు 2010లో యూఎస్ఏ, ఐరోపాలో విస్తృతంగా పర్యటించాడు. ఈ క్రమంలో 17 దేశాల్లోని అగ్రశ్రేణి స్టూడియోలను సందర్శించాడు. ఈ మేరకు కాలిఫోర్నియాకు చెందిన సుల్లెన్ టీవీ తమ కోసం ఓ షూట్ చేయమని గతేడాది లోకేష్‌ను ఆహ్వానించింది. అంతేకాదు ప్రపంచంలోనే తొలి టాటూయింగ్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ‘అకాడమీ టై పోలో’కు గెస్ట్ లెక్చరర్‌గా ఆహ్వానం పొందిన మొదటి ఆసియన్లలో ఒకరైన లోకేష్.. కలర్ రియలిజం, పోర్ట్రెయిట్స్ టాటూలు వేయడంలో దిట్ట.
హార్డ్ వర్క్ టు హార్ట్ వర్క్
లోకేష్ జీవితాన్ని కెరీర్ తొలినాళ్ల నుంచి 2021 వరకు ఫాస్ట్ ఫార్వార్డ్ చేస్తే.. అతడు ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన టాటూ ఆర్టిస్ట్. భారతదేశపు అతిపెద్ద టాటూ కన్వెన్షన్ ‘హార్ట్ వర్క్ టాటూ ఫెస్టివల్’ సహ వ్యవస్థాపకుడే కాదు, ఫేమస్ టాటూ స్టూడియో చెయిన్ ‘డెవిల్జ్ టాటూజ్’ ఫౌండర్ కూడా. ఇక అతడి క్లయింట్స్ జాబితాలో బాలీవుడ్ సెలబ్రిటీలు తాప్సీ పన్ను, స్వరా భాస్కర్, రెమో డిసౌజాతో పాటు ఇండియన్ క్రికెటర్లు శిఖర్ ధావన్, ఇశాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ తదితరులు ఉన్నారు.
‘నేను నెలవారీ పాకెట్ మనీని అలాగే దాచిపెట్టి సంవత్సరాంతంలో నా తల్లికి ఇచ్చేసేవాడిని. ఎందుకంటే ఆ డబ్బు నా కన్నా అమ్మకే ఎక్కువ అవసరం. చదువుకుంటున్న క్రమంలో ఎన్నో పార్ట్ టైమ్ జాబ్స్ చేసిన నేను.. నా తొలి టాటూ స్టూడియోను 2003లో ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్‌లో స్థాపించాను. దాంతో అప్పటిదాకా నాకున్న ప్యాషన్ కాస్త ప్రొఫెషన్‌గా మారిపోయింది. క్రమంగా గురుగ్రామ్, ద్వారకలోనూ స్టూడియోలు తెరిచాను. ఈ మేరకు ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫిమేల్ టాటూ ఆర్టిస్ట్స్ టీమ్‌ను క్రియేట్ చేశాను. మానవ శరీరంపై గరిష్ట సంఖ్యలో జెండాలను పచ్చబొట్టుగా వేసినందుకు గాను నా టీమ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది.
చాలా మంది టాటూ కళాకారులు ఉన్నప్పటికీ, ఈ వృత్తిని సూచించే నియంత్రణ సంస్థ లేదా గ్రూప్ ఇప్పటికీ లేదు. టాటూ మెయిన్‌స్ట్రీమ్ పాపులారిటీని సంపాదించినా, దీన్ని కెరీర్ చాయిస్‌గా ఎంచుకోలేకపోతున్నాం. టాటూ ఆర్టిస్ట్‌లకు నా సలహా ఏంటంటే.. వీలైనంత వరకు సాధన చేయండి. విజయానికి దగ్గరి దారి లేదని గుర్తుంచుకోండి. టాటూలు వేయడంలో భిన్నత్వాన్ని ప్రదర్శించండి. మీకంటూ ఓ ప్రత్యేక శైలిని కలిగి ఉండటం మంచిది. దేన్నయినా టాటూగా మలిచే సామర్థ్యాన్ని పొందండి. – లోకేష్, టాటూ ఆర్టిస్ట్