Russia: బ్రిటిష్ దౌత్యవేత్తను బహిష్కరించిన రష్యా.. గూఢచర్యం చేస్తున్నట్టు ఆరోపణ!

by vinod kumar |
Russia: బ్రిటిష్ దౌత్యవేత్తను బహిష్కరించిన రష్యా.. గూఢచర్యం చేస్తున్నట్టు ఆరోపణ!
X

దిశ, నేషనల్ బ్యూరో: గూఢచర్యం ఆరోపణలతో మాస్కోలోని రాయబార కార్యాలయంలో పనిచేస్తు్న్న బ్రిటీష్ దౌత్యవేత్త(British diplomat)ను బహిష్కరిస్తున్నట్లు రష్యా (Russia) మంగళవారం తెలిపింది. రెండు వారాల్లోగా దేశాన్ని విడిచిపెట్టాలని ఆదేశించింది. రష్యాలోకి వచ్చినప్పుడు ఆయన ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం అందించారని, అంతేగాక ఇంటెలిజెన్స్ సమాచారాన్ని బహిర్గతపర్చే కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మాస్కోలోని ఎఫ్‌ఎస్‌బీ సెక్యూరిటీ సర్వీసెస్ వెల్లడించింది. రష్యా భద్రతకు ముప్పు అని, అందుకే బహిష్కరిస్తు్న్నట్టు పేర్కొంది. ఇటీవల దౌత్య వేత్త చేసిన పలు చర్యలు గమనించామని అవి గూఢచర్యానికి పాల్పడేలా ఉన్నట్టు గుర్తించామని స్పష్టం చేసింది. అయితే, రష్యా చర్యపై బ్రిటన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించలేదు. మాస్కోలోని బ్రిటన్ రాయబార కార్యాలయం సైతం దీనిపై వ్యాఖ్యానించలేదు. కాగా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత బ్రిటన్, రష్యా మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి. యుద్ధం నేపథ్యంలో రష్యాపై బ్రిటన్ అనేక ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలను కూడా సరఫరా చేసింది. దీంతో తాజా పరిణామాలతో ఇరు దేశాల మధ్య మరింత పెరిగే చాన్స్ ఉంది.

Advertisement

Next Story

Most Viewed