కనీసం.. మా వైపు కన్నెత్తి కూడా చూడడంలేదు

by Shyam |
కనీసం.. మా వైపు కన్నెత్తి కూడా చూడడంలేదు
X

దిశ, మెదక్: మెదక్ జిల్లా హత్నూర మండల పరిధిలోని కోడిప్యాక గ్రామ శివారులో గల డైమండ్ హ్యాచరిస్ పరిశ్రమ కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఏడవ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ కార్మిక చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తూ కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేయడం ఎంతవరకు సమంజసమని వారు మండిపడ్డారు. గత వారం రోజులుగా తమ న్యాయమైన వేతన ఒప్పందం కోసం రిలే నిరాహార దీక్షలు చేస్తున్న పరిశ్రమ యాజమాన్యం మాత్రం తమ వైపు కన్నెత్తి చూడకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సారైన విధానం కాదన్నారు. కనీస సౌకర్యాలు కల్పించడంలో కూడా నిర్లక్షంగా వ్యవహరిస్తున్న పరిశ్రమపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోని కార్మికులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు రమేష్, శంకర్, ఏల్లం, ప్రభాకర్, పోచయ్య, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed