వర్క్‌ ఫ్రమ్‌హోం ప్రకటించండి : PRTU

by Shyam |
వర్క్‌ ఫ్రమ్‌హోం ప్రకటించండి : PRTU
X

దిశ, ఆందోల్: కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అనుమతించాలని పీఆర్టియూ జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వర్, ప్రధాన కార్యదర్శి మాణయ్యలు తెలిపారు. లాక్‌డౌన్ మార్గదర్శకాల ప్రకారం ఈ నెలాఖరు వరకు పాఠశాలలు ప్రారంభించడానికి అనుమతి లేదని, సెప్టెంబర్ 21 తర్వాత రోజు 50 శాతం విద్యా బోధనా, బోధనేతర సిబ్బంది హాజరయ్యేందుకు అనుమతించాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను రాష్ట్ర విద్యాశాఖ అమలు చేయాలని విన్నివించారు. పాఠశాలలకు వెళ్తూ, ఆన్‌లైన్ క్లాసుల చెబుతున్న ఉపాధ్యాయులు కొందరు కరోనా బారినా పడ్డారని, దాంతో మిగతా వారు ఆందోళనకు గురవుతున్నారని వివరించారు. ఉపాధ్యాయులు ఇంటి నుంచే విద్యార్థులను సమన్వయం చేసి, గ్రూప్ వీడియో కాల్ ద్వారా ఆన్‌లైన్ క్లాసులు చెప్పేందుకు టీచర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.దీనిపై ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని సంగమేశ్వర్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed