ప్రియాంక ప్రేమకు హాలీవుడ్ వండర్ ఉమన్ ఫిదా

by Jakkula Samataha |
ప్రియాంక ప్రేమకు హాలీవుడ్ వండర్ ఉమన్ ఫిదా
X

దిశ, సినిమా : గ్లోబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రియాంకచోప్రా.. తన జీవితానుభవాలు, జ్ఞాపకాల్ని అక్షరీకరిస్తూ ‘అన్‌ఫినిష్డ్‌’ పేరుతో ఓ పుస్తకాన్ని రాసిన విషయం తెలిసిందే. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్‌గా నిలిచిన ఈ ‘మెమోయిర్ అన్‌ఫినిష్డ్’ పుస్తక కాపీని ఇటీవలే ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ గాల్ గాడోట్‌కు పంపించింది ప్రియాంక. అందుకు గాడోట్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపడం విశేషం. కాగా ఇప్పటికే వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ప్రియాంక సాధించిన విజయాలు, ఆమె స్ఫూర్తి గాథ అభినందనీయమని పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు తనపై ప్రశంసలు కురిపించారు. అయితే గాల్ గాడోట్‌కు పంపించిన ‘అన్‌ఫినిష్డ్’ అన్‌బాక్సింగ్ వీడియోలను ఆమె తన లక్షలాది మంది అభిమానులతో పంచుకుంది. ఇందులో ప్రియాంక రాసిన ఆత్మీయపూర్వక నోట్ ‘నీ ప్రేమకు ధన్యవాదాలు @ ప్రియాంకచోప్రా’ అని కూడా ఉండటం విశేషం. దీనికి రిప్లయ్‌గా ప్రియాంక రెండు హార్ట్ ఎమోటికాన్స్ ఉపయోగించింది.

Advertisement

Next Story

Most Viewed