- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాబోయే భర్తే కదా.. నగ్న ఫోటోలు, న్యూడ్ వీడియో కాల్స్.. చివరకు ఏమైందంటే.?
దిశ, వెబ్‌డెస్క్ : ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలనుకున్న ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. తనను పెళ్లిచేసుకోబోయే వాడే తన పాలిట శత్రువు అవుతాడని ఆమె కళలో కూడా ఊహించలేదు. అతడు చేసిన పని తట్టుకోలేక మరణమే శరణ్యం అనుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిదంటే.?
వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట్ గ్రామానికి చెందిన జుట్టు రామ్ కార్తీక్ అలియాస్ రమేష్.. ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసేవాడు. అతడికి మహేశ్వరం మండలం పెండ్యాల గ్రామానికి చెందిన ప్రగతితో ఏడాది కిందట పెళ్లి నిశ్చయమైంది. అప్పటి నుంచి కార్తీక్ కాబోయే భార్యకు రోజూ వీడియో కాల్స్ చేసి మాట్లాడేవాడు. ఈ సందర్భంగా ఆమె నగ్న చిత్రాలు, వీడియోలు రికార్డు చేశాడు.
అయితే కొద్ది రోజుల క్రితమే కార్తీక్ ఆస్ట్రేలియా నుంచి తన స్వగ్రామానికి తిరిగివచ్చాడు. తీరా పెళ్లికి టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ కార్తీక్ తన అసలు క్యారెక్టర్‌ను బయటకు తీశాడు. తాను విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాని.. వేరే సంబంధమైతే ఇంకా ఎక్కువ కట్నం వచ్చేదని.. అందుకే తనకు ఇంకా ఎక్కువ కట్నం కావాలని డిమాండ్ చేశాడు. ప్లాట్, భూమి తనకు ఇవ్వాలని ప్రగతి, ఆమె తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో అక్టోబర్ 21న ఎంగేజ్మెంట్ ఉండగా ఇరు కుటుంబాల మధ్య 17వ తేదీన కట్నకానుకల విషయంలో గొడవ జరిగింది. పెళ్లికొడుకు, వారి కుటుంబం ఇలా చేయడంతో ప్రగతి పేరెంట్స్ బాగా ఆలోచించి.. చివరకు ఈ సంబంధాన్ని రద్దు చేసుకున్నారు.
సమంత షాకింగ్ డెసిషన్.. ఇక వాటికి గుడ్ బై చెప్పనుందా ?
దీంతో ఒక్కసారిగి ప్రగతికి పెద్ద షాక్ తగిలింది. కార్తీక్ తన నగ్న ఫొటోలు, వీడియోలు బయటపెడితే ఎలా అని తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ విషయం పేరెంట్స్‌కు చెప్పలేక ఆందోళన చెంది చివరకు అక్టోబర్ 18న అర్ధరాత్రి ఇంట్లో ప్యాన్‌కు ఉరి వేసుకొని ప్రగతి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే పెళ్లి అనుకోకుండా చెడిపోయిన కారణంగానే ప్రగతి ఆత్మహత్య చేసుకుందని అందరూ అనుకున్నారు. ప్రగతి ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో వారికి ప్రగతి, కార్తీక్ మధ్య జరిగిన ఫోన్ కాల్స్, చాటింగ్ వివరాలను పరిశీలించగా పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. కార్తీక్.. ప్రగతి నగ్న ఫోటోలు, వీడియోలతో ఆమెను బ్లాక్మెయిల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అందుకే ప్రగతి ఆత్మహత్యకు చేసుకుందని పోలీసులు నిర్ధారించారు. దీంతో కార్తీక్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
చోరీ చేసే ముందు అమ్మవారికి మొక్కిన దొంగ
Eesha Rebba : ఈషా రెబ్బ లేటెస్ట్ ఫోటో షూట్.. నడుమందాతో కవ్విస్తోన్న భామ
- Tags
- Harassments