- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లైంగిక వేధింపులు: ఆనందపడాలి.. పరువు నష్టం కాదు
దిశ, వెబ్ డెస్క్ : 15 మంది మహిళా జర్నలిస్ట్ లు తమపై లైంగిక దాడులు జరిగాయని భయపడకుండా బహిర్ఘతం చేయడంపై సంతోషించాలని కానీ, పరువు నష్టంపై విచారణ చేపట్టడం ఎంతవరకు సబబు అంటూ ఢిల్లీ కోర్ట్ లో జర్నలిస్ట్ ప్రియా రమణి తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
2018 అక్టోబర్ నెలలో బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తా.., నానాపటేకర్ తనని లైంగికంగా వేధించారని ఆరోపించారు. ఈ ఆరోపణలు దేశ వ్యాప్తంగా ఉన్న బాధిత మహిళల్లో ధైర్యాన్ని నింపింది. వారంతా తమకి ఎదురైన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. సినిమా, సాహిత్యం, మీడియా, క్రీడలు, రాజకీయాలు చివరికి ప్రభుత్వంలోనూ ఈ ప్రకంపనలు రేగడంతో పని ప్రాంతాల్లో మహిళల భద్రతపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.
తాజాగా మీటూ అంశంపై ఢిల్లీ కోర్ట్ లో విచారణ జరిగింది. 2018 లో కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేసిన ఎంజే అక్బర్ 20 ఏళ్ల క్రితం టెలిగ్రాఫ్, ఏసియన్ ఏజ్ పత్రికల ఎడిటర్‌గా ఉన్న సమయంలో అక్బర్ స్విమ్మింగ్ పూల్ లో పార్టీలు చేసుకునే సమయంలో మహిళా జర్నలిస్టులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు చేసిన వారిలో ప్రముఖ జర్నలిస్ట్ ప్రియా రమణి ఉన్నారు. అక్బర్ ఎడిటర్ గా తాను జర్నలిస్ట్ గా పనిచేసే సమయంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఆ ఆరోపణలపై అక్బర్ మాట్లాడుతూ నాకు ఈత కొట్టడమే రాదు. కానీ, నేను స్విమ్మింగ్ పూల్‌లో పార్టీలు చేసుకుంటానని చెబుతున్నారు. ఈ తప్పుడు ఆరోపణలపై ఏం చేయాలనేది నా లాయర్లు నిర్ణయిస్తారు’’ అని తెలిపారు. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన రెండు రోజుల తరువాత అక్బర్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు.
రాజీనామా అనంతరం తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, తన పరువుకు భంగం కలిగించిన జర్నలిస్ట్ లపై పరువునష్టం దావా వేశారు. దీంతో పరువు నష్టం దావా ఆరోపణల్లో విచారణ ఎదుర్కొంటున్న జర్నలిస్ట్ రమణి ఢిల్లీకు హాజరయ్యారు.
విచారణ సమయంలో మహిళా జర్నలిస్ట్ లు ధైర్యంగా ముందుకు వచ్చి తమపై లైంగిక దాడులు జరిగాయని చెప్పడం పై ఆనంద పడాలి. కానీ ఇలా పరువునష్టంపై విచారణ చేపట్టడం కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు రమణి. అంతేకాదు మీటూ వేదికగా లైంగిక వేధింపులపై మాట్లాడడం నేరం కాదని, అలా మాట్లాడేందుకు ధైర్యం కావాలన్న మహిళా జర్నలిస్ట్ .., పరువు నష్టంపై ఎదుర్కోవాల్సిన చర్యలు కాదన్నారు. అంతకంటే ముందు గతంలో తమపై జరిగిన లైంగిక దాడుల గురించి భయటపెట్టారు. అలాంటి వారు దోషులు ఎలా అవుతారని రమణి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది రెబెకా జాన్ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ ముందు తమ వాదనల్ని వినిపించారు.
కాగా పీటీఐ కథనం ప్రకారం..తనతో పాటు 15 మంది మహిళా జర్నలిస్టులు కూడా అక్బర్ పై ఇలాంటి ఆరోపణలు చేశారని రమణి న్యాయమూర్తికి చెప్పారు. 15 మంది మహిళలు మోసపోయారు. 2018 మీటూ సమయంలో అందరూ తమకు జరిగిన అన్యాయాన్ని బయట ప్రపంచానికి తెలిసేలా చేశారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఇరు పక్ష వాదనల్ని విన్న కోర్ట్..కేసు విచారణను డిసెంబర్ 18కి కోర్ట్ వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.