- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
40 ఏళ్ల తర్వాత క్యాబినెట్‌లో మహిళా మంత్రికి చోటు
చెన్నై: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి సీఎంగా ఎన్ రంగసామి ప్రమాణం చేసిన రెండు నెలల తర్వాత మంత్రివర్గం సిద్ధమైంది. తాజాగా.. ఆదివారం ఐదుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌నివాస్‌లో ఏ నమశ్శివాయమ్, కే లక్ష్మీనారాయణన్, సీ జీకొమార్, చందిరా ప్రియంగా, ఏకే సాయి జే శరవణ కుమార్‌లతో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఏఐఎన్‌ఆర్‌సీ చీఫ్, సీఎం ఎన్ రంగసామి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో బీజేపీ నేతలు నమశ్శివాయమ్, శరవణ కుమార్‌లున్నారు.
మిగతా మంత్రులు ఏఐఎన్‌ఆర్‌సీ పార్టీ నేతలు. నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ మహిళా మంత్రికి పుదుచ్చేరి క్యాబినెట్‌లో చోటుదక్కింది. 1980-83 కాలంలో కాంగ్రెస్ దివంగత నేత రేణుకా అప్పదురయి పుదుచ్చేరి విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకూ బెర్తు లభించడంతో కేంద్రపాలిత ప్రాంతం ప్రభుత్వంలో తొలిసారి పాత్ర పోషించనుంది. తన మంత్రివర్గ సభ్యుల జాబితాను సీఎం రంగసామి బుధవారం ఎల్జీ తమిళిసై సౌందరరాజన్‌కు అందజేశారు. ఏప్రిల్‌లో పుదుచ్చేరికి ఎన్నికలు జరగ్గా మే 2న ఫలితాలు వెలువడ్డాయి. 33 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో పది సీట్లతో లార్జెస్ట్ పార్టీగా ఏఐఎన్‌ఆర్‌సీ నిలవగా బీజేపీ ఆరు సీట్లను గెలుచుకుంది.