- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుళ్లిపోయిన స్థితిలో మహిళ డెడ్‌బాడీ.. ఇంటికి తాళం వేసి!
దిశ, జవహర్ నగర్ : అద్దె ఇంటిలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ భిక్షపతి రావు కథనం ప్రకారం.. జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని సంతోష్ నగర్ భద్రయ్య కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న అబ్దుల్ గత ఐదు రోజుల నుండి కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలోనే అతను ఉంటున్న ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్లి పరిశీలించారు. అక్కడ గుర్తు తెలియని మహిళ (35) మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం కుళ్లిపోయిన స్టేజ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్నది.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.