తోటి పోలీసులే పెళ్లి పెద్దలు.. పీఎస్‌లో మహిళా కానిస్టేబుల్‌కు ‘హల్దీ’ ఫంక్షన్..

by Shamantha N |   ( Updated:2021-04-24 22:02:45.0  )
తోటి పోలీసులే పెళ్లి పెద్దలు.. పీఎస్‌లో మహిళా కానిస్టేబుల్‌కు ‘హల్దీ’ ఫంక్షన్..
X

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి అంటేనే కలర్ ఫుల్ పండుగ. ఇంటి నిండా చుట్టాలు, సందడి నెలకొంటుంది. పెళ్లికి ముందురోజు పెళ్లికూతురు, పెళ్లికొడుకుకి ‘హల్దీ’ (పసుపు రాయడం) సాంప్రదాయం. ఇలాంటి వేడుకలు దక్షిణ భారతంలోనూ ఉన్నప్పటికీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ప్రయారటీ ఎక్కువగా ఇస్తుంటారు. అక్కడి వారు వివాహ వేడుకలకు చేసే ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. పెళ్లిని ఓ పండుగలా జరుపుతుంటారు. ప్రస్తుతం కొవిడ్ నేపథ్యంలో చాలా వరకు పెళ్లిళ్లు వాయిదా పడుతున్నాయి. మరికొందరు వాయిదా వేయడం ఇష్టం లేక లిమిటెడ్ మెంబర్స్‌తో పెళ్లి తంతును ముగిస్తున్నారు. ప్రస్తుతం సెకండ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు విజృంభిస్తున్నాయి. దీంతో ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగికి తోటి ఉద్యోగులే దగ్గరుండి పెళ్లికి ముందు జరిపే సాంప్రదాయాన్ని దగ్గరుండి నిర్వహించారు. అది కూడా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరపడంతో ఆ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాజస్థాన్ రాష్ట్రం దుంగర్‌పూర్ జిల్లాకు చెందిన ఓ మహిళ పోలీస్ కానిస్టేబుల్‌ స్థానికంగా ఉండే పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోంది. ఇటీవల ఆమెకు వివాహం నిశ్చయం కావడంతో ఉన్నతాధికారులను సెలవు కోరుతూ విజ్ఞప్తి చేసింది. ఆ జిల్లాలో ప్రస్తుతం కేసులు ఎక్కువగా పెరుగుతుండటంతో లీవ్ ఇవ్వడం కుదరదని అధికారులు తేల్చేశారు. ఉద్యోగులందరూ విధుల్లో ఉండాలని స్పష్టంచేశారు. దీంతో తోటి ఉద్యోగులే కొవిడ్ రూల్స్ పాటిస్తూ ఆ మహిళా కానిస్టేబుల్‌కు దగ్గరుండి ‘హల్దీ’ వేడుకను పూర్తి చేశారు. తోటి మహిళా పోలీసులు పెళ్లికూతురకు పసుపు రాస్తున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ తతంగమంతా స్టేషన్ ఉద్యోగి ఒకరు వీడియోలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed