- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళపై ఎస్సై రేప్.. పీఎస్ కాంపౌండ్లోనే!
జైపూర్ : ప్రజలకు రక్షణనివ్వాల్సిన ఓ ఎస్సై కామాంధుడయ్యాడు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళపై మూడు రోజులుగా లైంగికదాడికి పాల్పడ్డాడు. అదీ పోలీసు స్టేషన్ కాంపౌండ్లోనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘటన రాజస్తాన్‌లోని అల్వారు జిల్లాలో జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ఈ దుర్ఘటన వివరాలు వెలుగులోకి రావడం గమనార్హం. 26 ఏళ్ల యువతి తన భర్తపై ఫిర్యాదుతో ఈ నెల 2న పీఎస్‌కు వెళ్లింది. ఆ రోజునే ఆమెపై ఎస్సై లైంగికదాడికి పాల్పడినట్టు తెలిసింది. ఈ ఘటనపై అల్వారు ఎస్పీ మాట్లాడుతూ, ‘2018లో బాధితురాలు తన భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. తర్వాత ఆ వ్యవహారం సెటిల్ అయింది.
తాజాగా, ఆమెకు విడాకులు ఇవ్వడానికి తన భర్త ప్రయత్నిస్తున్నాడు. కానీ, దానికి ఆమె ఒప్పుకోవడం లేదు. ఈ సందర్భంగానే తన భర్తపై ఫిర్యాదుతో ఆమె స్టేషన్‌కు వచ్చారు’ అని తెలిపారు. మార్చి 2 నుంచి 4వ తేదీ వరకు పీఎస్ కాంపౌండ్‌లో ఎస్సై నివాసంలోనే రేప్ చేసినట్టు సమాచారం. ‘ఈ విషయం తెలియగనే రేప్ కేసు నమోదు చేశాం. ప్రస్తుతం నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. బాధితురాలు ఓ ఫోన్ రికార్డింగ్‌ను అందించింది. నిందితుడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నాం. ఎస్హెచ్వోపైనా చర్యలకు ఉపక్రమిస్తున్నాం’ అని ఎస్పీ తెలిపారు.