- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డేటింగ్‌లో ఉండగానే పెండ్లి.. భర్తను ముక్కలు చేసి ప్రియుడితో..!
దిశ, వెబ్‌డెస్క్: 18 ఏండ్ల వయస్సులో బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్‌లో ఉంటే తల్లిదండ్రులు ఇష్టంలేని పెండ్లి చేశారని భర్తను హత్య చేసింది ఓ భార్య. 2011లో జరిగిన ఈ మర్డర్ కేసును ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎట్టకేలకు చేధించారు.
పూర్తి వివరాల్లోకి విళితే..
ఢిల్లీకి చెందిన శకుంతల(28).. 18 ఏండ్ల వయస్సులో నుంచి కమల్ సింగ్లా (వ్యాపారవేత్త)తో డేటింగ్‌లో ఉంది. ఇదే సమయంలో 2011లో రవికుమార్ అనే వ్యక్తితో యువతి తల్లిదండ్రులు శకుంతలకు వివాహం జరిపించారు. ఇష్టంలేని పెళ్లి చేసుకుని భర్తతో కాపురం చేయడానికి ఇబ్బందిపడిన శకుంతల ఎలాగోలా అడ్జస్ట్ అయింది. కానీ, కమల్ సింగ్లా ప్రేమ వ్యవహారం తెలుసుకున్న రవి కుమార్ ఆమెకు కండీషన్స్ పెట్టాడు. ఫోన్ మాట్లాడనివ్వకపోవడం, ఆమె కదలికలపై నిఘా వేయడంతో.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య చేసేందుకు ప్లాన్ చేసింది శంకుతల. ఇదే విషయం ప్రియుడితో చర్చించి ఇద్దరు కలిసి ఓ ప్లాన్ వేశారు.
పోలీసులకు దొరక్కుండా..
హత్య చేసిన తర్వాత పోలీసులకు దొరికిపోతామని ముందుగానే గ్రహించిన శకుంతల-కమల్ జాగ్రత్త పడ్డారు. అందుకే హత్య చేసిన తర్వాత.. డెడ్‌బాడీని ఢిల్లీ నుంచి కమల్ వ్యాపారం చేస్తున్న అల్వార్(రాజస్థాన్)కు తరలించారు. అక్కడే ఓ ప్రాంతంలో సమాధి చేశారు. మళ్లీ కొద్దిరోజులకే శవాన్ని వెలికి తీసి.. హర్యానా-రెవారి రహదారిపై పడవేశారు. ఆ తర్వాత ఎవరికీ చిక్కమన్న ధీమాతో రాజస్థాన్‌లోనే సెటిల్ అయ్యారు. అయితే, మృతదేహాలు ముక్కలు ముక్కలుగా దర్శనమిచ్చిన వ్యవహారం అప్పట్లో రాజస్థాన్‌లో హాట్ టాపిక్ అయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు పురోగతి సాధించలేక.. కేసును క్రైమ్ బ్రాంచ్‌కు బదలాయించారు.
కేసును హ్యాండ్ ఓవర్ చేసుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హత్య అనంతరం ఆరేండ్ల పాటు సహజీవనం చేసిన శకుంతల-కమల్ 2017లో వివాహం చేసుకున్నట్టు గుర్తించారు. ప్రియుడితో కలిసి ఉండేందుకు భార్యనే హత్య చేసిందని తేల్చారు. ఇదే క్రమంలో 2018లో రాజస్థాన్‌లోనే ఈ జంట నివాసం ఉంటున్నారని తెలుసుకొని.. ముందుగా కమల్‌ను అరెస్ట్ చేశారు. శకుంతల మాత్రం అక్కడి నుంచి ఎస్కేప్ అయింది. ఈ వ్యవహారాన్ని సవాల్‌గా తీసుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెపై రూ. 50 వేల రివార్డును కూడా ప్రకటించారు. చివరకు అల్వార్‌లోనే సంచరిస్తుందని తెలుసుకున్న పోలీసులు ఎట్టకేలకు శంకుతలను అరెస్ట్ చేశారు.